అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న తమన్నా ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

అందులో భాగంగా  తమన్నా నటించిన సినిమా గుర్తుందా శీతాకాలం,  ఈ సినిమాలో సత్యదేవ ప్రధాన పాత్రలో నటించాడు. నాగేష్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను  నాగేష్కర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్,  శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ లపై భావన రవి, నాగేష్కర్, రామారావు చింతపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు, ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఇది ఇలా ఉంటే రెండు రోజుల క్రితం గుర్తుందా శీతాకాలం సినిమా నుండి చిత్ర బృందం ఒక సాంగ్ ని విడుదల చేసింది, గుర్తుందా శీతాకాలం అంటూ సాగే ఈ సాంగ్ కు కాల భైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సాంగ్ కు శ్రీ మణి లిరిక్స్ ను అందించగా, సంజిత్ హెగ్డే ఈ పాటను పాడాడు. రెండు రోజుల క్రితం విడుదల అయిన ఈ సాంగ్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది,  యూట్యూబ్ లో ఇప్పటికే ఈ సాంగ్  మిలియన్ వ్యూస్ ను సాధించింది.  ఇది ఇలా ఉంటే తమన్నా ప్రస్తుతం తెలుగులో ఈ సినిమా తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: