ఈ రోజు థియేటర్ లలోకి మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి రవితేజ నటించిన ఖిలాడీ, విష్ణు విశాల్ నటించిన ఎఫ్ఐఆర్ మరియు యువ హీరో నటించిన సెహరి లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేసాయి. అయితే ఇందులో తమిళ్ హీరో విష్ణు విశాల్ నటించిన "ఎఫ్ ఐ ఆర్" గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ముందు విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు. అయితే ఈ సినిమా థ్రిల్లర్, టెర్రరిస్ట్, దేశ భక్తి వంటి అంశాలు మేళవించిన చిత్రం అన్నది ట్రైలర్ చూస్తేనే అర్దమవుతుంది. అయితే డైరెక్టర్ మను ఆనంద్సినిమా విషయంలో కొన్ని పొరపాట్లు చేసినట్లు తెలుస్తోంది.

సినిమా మొదటి నుండి ప్రేక్షకుడిని కథలో లీనం చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఇక్కడ డైరెక్టర్ సినిమాలో ఉన్న పాత్రలను పరిచయం చేయడానికి సమయం అంతా వృధా చేశాడు. దీనితో సగటు ప్రేక్షకుడు ఊహించిన రీతిలో ఫస్ట్ హాఫ్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో హీరోకి మరియు అతని తల్లికి మధ్యన వచ్చే సన్నివేశాలను అనుకున్న విధముగా తెరకెక్కించలేకపోయాడు. ఇక్కడే డైరెక్టర్ అనుభవ లేమి అర్ధమవుతోంది.

ఇక యూత్ ను ఆకట్టుకునే ప్రేమ ఎపిసోడ్ కూడా నీరు కారిపోయింది. ఏదో పాత్ర ఉండాలి కాబట్టి పెట్టినట్లుగా ఉంది.

అంతే కాకుండా టెర్రరిస్ట్ కథలకు ఎప్పుడైనా ట్విస్ట్ లు మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రాణం పోస్తాయి. ఈ విషయంలో ట్విస్ట్ లు ఓకే కానీ, టెర్రరిస్ట్ మరియు అతని చుట్టూ జరిగే సన్నివేశాలు కూడా ప్రేక్షకుడిని థ్రిల్ చేయలేకపోయాయి.

ఈ సినిమాలో ఏమైనా చెప్పుకోవాలి అంటే అది హీరో విష్ణు విశాల్ గురించి మాత్రమే. సినిమా భారాన్ని మొత్తం తన  నటనతో బ్రతికించడానికి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ఇందులో తన పెర్ఫార్మన్స్ కి మరిన్ని మంచి మంచి అవకాశాలు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక సినిమాల్లో ఉన్న మిగిలిన పాత్రలు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి.

ఒకవేళ ముందు ముందు మను ఆనంద్ కు సినిమా అవకాశాలు వస్తే తన టేకింగ్ లో మార్పులు చేసుకోకపోతే డైరెక్టర్ గా కొనసాగడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: