రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్యూట్ బ్యూటీ రష్మిక మందన పెళ్లి త్వరలో జరగబోతుంది.. ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలిన ఇద్దరు ఇక ఇప్పుడు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు.. గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది. ఇదిఅయితే ఎప్పుడు సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. అనేది అందరికి తెలిసిందే. మరి అలాంటిది ఇక వీరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అలాంటి జోడి మీద వార్తలు రాకుండా ఉంటాయా.. గీత గోవిందం సినిమా తో రష్మిక విజయ్ దేవరకొండ కలిసి నటించారు..


 సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అందరికీ ఒక సినిమాతోనే ఇద్దరూ ఫేవరేట్ జోడి గా మారిపోయారు. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలో మళ్లీ కలిసి నటించారు. ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ టచ్ ఎక్కువగానే ఉంది. దీంతో ఇద్దరిని చుసిన ప్రేక్షకులు లవ్ లో ఉన్నారు అని ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమా తరువాత మంచి స్నేహితులు గా మారిన రష్మిక మందన విజయ్ పలు పార్టీల లో కలిసి కనిపించారు. ఇంకేముంది వీరిద్దరికీ ప్రేమ అనే బంధం అంటగట్టేశారు నెటిజన్లు.  ఇక వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ ఎన్నో వార్తలు రాసేసారు. ఇక ఇప్పుడు ఇద్దరికీ పెళ్లి చేసేందుకు కూడా సిద్ధమైపోయారు నెటిజన్లు.


 గత కొన్ని రోజుల నుంచి ఇద్దరూ రిలేషన్ షిప్ లో మునిగి తేలుతున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు అటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరకు వెళ్లాయి. ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ తనదైన శైలిలో స్పందించే విజయ్ దేవరకొండ.. ఈ వార్తపై కూడా అలాగే స్పందించాడు. ఎప్పటిలాగే నాన్సెన్స్ చెత్త వార్తలు అంటూ సెటైరికల్ గా ఆగ్రహం వ్యక్తం చేశాడు విజయ్ దేవరకొండ. గతంలో కూడా ఫేక్ న్యూస్ లపై విజయ్ దేవరకొండ తనదైన శైలిలో సెటైర్లతో విరుచుకుపడ్డాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: