టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సంగీత దర్శకులలో కోటి ఒకరని అందరికి తెలుసు.కాగా కోటి సంగీతం అందించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

కోటి పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు కాగా ప్రస్తుతం కోటి సింగింగ్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో కోటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారట.కోటి దగ్గర శిష్యరికం చేసిన మణిశర్మ మరియు ఏ ఆర్ రెహమాన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా కోటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ ను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని మ్యూజిక్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల మ్యూజిక్ డైరెక్టర్ల సాంగ్స్ ను కాపీ కొట్టడం మాత్రం జరగలేదని కోటి పేర్కొన్నారట. మేము కావాలని పాటలు కాపీ చేయమని దర్శకనిర్మాతల కోరిక మేరకు మాత్రం కొన్నిసార్లు అలా పాటలు చేయాల్సి వస్తుందని ఆయన తెలిపినట్లు సమాచారం..

చిరంజీవి గారి సినిమాలకు చేయాలంటే భయం ఉంటుందని ప్రతి పాట హిట్ చేయాలని అందువల్ల ఎంతో హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుందని కోటి తెలిపారు. ఇ.వి.వి సత్యనారాయణ బ్రదర్ లాంటి వారు అని కోటి తెలిపారు. ఇ.వి.వి సత్యనారాయణ అల్లుడా మజాకా సినిమాకు తనకు ఛాన్స్ ఇప్పించారని కోటి చెప్పుకొచ్చారు. తనపై ఆయనకు మంచి అభిప్రాయం ఉండటంతో ఇ.వి.వి.సత్యనారాయణ మంచి ఆఫర్లు ఇచ్చారని కోటి తెలిపారు.

మోహన్ బాబుతో చాలాసార్లు కూడా గొడవలయ్యాయని అయితే టాలెంట్ ఉంది కాబట్టి సినిమా ఛాన్స్ పోయేది కాదని కోటి చెప్పుకొచ్చారు. ఆర్కెస్ట్రాకు మోహన్ బాబు ప్యాకప్ చెబితే నేను ప్యాకప్ చెప్పాలని మీరెవరు చెప్పడానికి అని నేను అన్నానని కోటి తెలిపారట. ఆ తర్వాత దర్శకుడు బి.గోపాల్ ఇంటికొచ్చి మరి సర్ది చెప్పేవారని కోటి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: