ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం కోసం ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కూడా పోటీ పడుతున్నారు. ప్రభాస్ తో కేవలం ఒక చిన్న రోల్ నటించే అవకాశం వచ్చినా కూడా చాలని ఎంతో మంది ఆర్టిస్టులు భావిస్తున్నారు.. ఇక పాన్ ఇండియా చిత్రంలో ఏ చిన్న పాత్ర అయినా కూడా ప్రేక్షకులకు బాగా తెలిసిన ఆర్టిస్టులనే సినిమాలో ఉంచాలని మేకర్ భావిస్తూ ఉంటారు.. ఎందుచేతనంటే ఆ స్థాయికి తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది.


అలాంటి పాన్ ఇండియా సినిమాలో ఒక చిన్న హీరోయిన్ కి ఛాన్స్ వచ్చింది అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్ రిద్ది కుమార్ కు ఛాన్స్ రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈమెది స్వస్థలం పూణే.. మోడలింగ్ రంగం నుంచి సినిమాల వైపు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె జనాలకు అంతగా తెలియకపోవచ్చు.. ఎందుకంటే ఈమె తన కెరియర్ ను మొదలు పెట్టింది తక్కువ కాలమే. అంతే కాకుండా ఏ భాషలో కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు. కేవలం తెలుగులో రాజ్ తరుణ్ తో కలిసి "లవర్ "అనే సినిమాలో నటించింది. ఇక ఈ చిత్రం ఎప్పుడు విడుదలైంది ఎవరికీ తెలియలేదు.


ఇక అలాంటి అమ్మాయి కి రాధే శ్యామ్ సినిమాలో నటించే అవకాశం రావడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.. కేవలం ఈమె నటిస్తున్నదని ఇప్పుడు చెప్పే వరకు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ప్రభాస్ తో నటించడం చాలా గొప్పగా అనిపించిందని రిద్ది కుమార్ తెలియజేసింది. ఈ చిత్రంలో తను సార్ ఆ పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. చూడడానికి ఈమె చామంతి పువ్వు లా కనిపించినప్పటికీ, అందంతో ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. మరి ఈ సినిమాతో ఈమె సక్సెస్ అవుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: