టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. బాహుబలి తర్వాత ఒక్కసారిగా రెక్కలు వచ్చిన గుర్రంలా దూసుకు వెళుతున్నాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. కాగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టొరీ గా రాధే శ్యామ్ నిన్న రిలీజ్ అయింది. అయితే ఎంతో కాలం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ప్రేమకథ కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. సెకండ్ హాఫ్ మినహా సినిమా కూడా ప్రేమికులను ఆకట్టుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 400 కోట్ల పెట్టి తీసిన సినిమాలో డైరెక్టర్ కొన్ని విషయాలపై ఎందుకు శ్రద్ద పెట్టలేదో అర్థం కాని విషయం.

ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న నటుల విషయంలో దర్శకుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావడం లేదు. సినిమా పరంగా ఒక పాత్రను తీసుకుంటే ఆ పాత్రకు తగిన స్కోప్ ఉండాలి అప్పుడే వారికి ఇచ్చిన రెమ్యునరేషన్ కి న్యాయం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద పెద్ద నటులను తీసుకుని వారిని సినిమాలో సరిగా ఉపయోగించుకోకపోతే లాభం ఏమిటి? ఇప్పుడు ప్రేక్షకుల మదిలో మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో తీసుకున్న నటులను సరిగా వాడుకోలేదు.

ఉదాహరణకు ఈ సినిమాలో మురళి శర్మ లాంటి టాలెంటెడ్ నటుడు ఉన్నాడు అన్న మాట టైటిల్ కార్డ్స్ లో మాత్రమే తెలుస్తుంది. సినిమాలో రెండు మూడు సీన్స్ లో కనిపిస్తాడు అంతే. మరి అతనికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలియదు కానీ.... ఇది పూర్తిగా డైరెక్టర్ వైఫల్యం. బాలీవుడ్ సీనియర్ నటి అయిన భాగ్య శ్రీ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా లో కాస్టింగ్ గురించి తెలిసి ఆమె ఈ సినిమాలో నటిస్తోంది అని తేలియాగానే, ఆమె అభిమానులు ఈమెపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈమెకు కూడా సరైన పాత్ర దొరకలేదు.

ఇక మళయాళ సీనియర్ నటుడు జయరామ్ ను కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. కానీ ఇతనిని కూడా సరిగా వాడుకోలేదు. ఏదో హాస్పిటల్ లో కొంత కామెడీ పండించడనైకి ట్రై చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక షిప్ లో సీన్ ఆకట్టుకోలేదు. అన్నింటికంటే మెయిన్... ముందుగా ట్రెయిలర్ లో తమిళ నటుడు సత్యరాజ్ ను చూపించారు. కానీ సినిమాలో ఎక్కడ సత్యరాజ్ లేడు. ఇందుకు కారణం ఏమిటో కూడా తెలియదు. ఇలా పాత్రల విషయంలో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ పలు పొరపాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: