బాహుబలి, కే జి ఎఫ్, పుష్ప వంటి చిత్రాల తర్వాత సౌత్ నుంచి వెళ్ల ప్రపంచవ్యాప్తంగా అందరి చర్చలో భాగం పంచుకున్న సినిమా రాధే శ్యామ్. బాహుబలి తర్వాత దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. అలా వారు సాహో సినిమా ను భారీ స్థాయిలో విజయవంతం చేశారు. రాధే శ్యామ్ విషయంలోనూ ఏమాత్రం తగ్గలేదు వారు. మొదటి రోజున చాలా మంది ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి కనబరచడం విశేషం. జాతీయ స్థాయిలో మీడియా కూడా ఈ సినిమా విషయం లో మంచి అటెన్షన్ ను చూపింది. అలా ప్రేక్షకులు మాత్రం ఒకసారైనా ఈ సినిమా చూడాలనే కోరిక తో సినిమా కు వెళ్తున్నారు.  


అయితే కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తి స్థాయి లో నచ్చలేదని చెప్పాలి. ప్రభాస్ మరియు పూజాహెగ్డే ల కెమిస్ట్రీ బాగానే ఉన్నా కూడా వారి మధ్య లవ్ ట్రాక్ గతి తప్పింది అంటున్నారు. చాలా జాతీయ మీడియా సంస్థలు ఈ సినిమా గురించి బ్యాడ్ టాక్, రివ్యూ లే ఇచ్చాయి. పెద్ద మీడియా సంస్థలైతే బాగానే విమర్శలు చేశాయి. ఇది కష్టతరమైన ప్రేమ కథ అని అన్నారు. ఇకపోతే ఈ సినిమా కథ చాలామంది స్క్రీన్ ప్లే నే నిరాశకు గురి చేసిందని ప్రభాస్ ను చూడడానికి మాత్రమే ఈ సినిమా వెళ్ళాలని అన్నారు. టైటానిక్ రేంజ్ తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేశారు కానీ ఆ ఎలివేషన్ సినిమా కు ఉపయోగపడలేదు అని అన్నారు.

 
ప్రేమ కథ కూడా తగినంత స్పష్టంగా లేదని రెండు గంటలకు పైగా సాగే మెలికలు తిరిగిన గందరగోళం అందరినీ అలరించడంలో విఫలం అయింది అని చెప్పడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని కొంతమంది చెప్పారు. చాలా అర్థం లేని సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని విమర్శించారు. గొప్ప టైటిల్ పెట్టిన కూడా ఆశించినంతగా సినిమా టాక్ వినిపించలేదని ఒక మీడియా సంస్థ వెల్లడించింది. మొదట పూజా హెగ్డే మరియు ప్రభాస్ మధ్య మంచి కెమిస్ట్రీ లేదని వారు ప్రేమలో పడే ప్రయాణం కొన్ని హాస్య సన్నివేశాలను జోడించడం కోసం ఆకస్మికంగా అన్ని జరుగుతూ ఉండడం జరిగిందని చెప్పారు అలాగే కొంతమంది మెజారిటీ అభిమానులు కూడా సినిమా పై పెదవి విరిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: