హీరోలైనా హీరోయిన్ లు అయినా సినిమా పరిశ్రమలో నలుగురి దృష్టిలో పడాలి అంటే తప్పకుండా వారికి వరుస సక్సెస్ లు వస్తూనే ఉండాలి లేదంటే సదరు హీరో హీరోయిన్స్ ని ఎవరూ కూడా పట్టించుకోరు. ముఖ్యంగా హీరోల విషయానికి వస్తే హీరోలు విజయాలను అందుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి లేదంటే  వారికి సినిమాలు రావడమే గగనమైపోతుంది. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రమాదపు అంచుల్లో ఉన్నాడు హీరో రాజ్ తరుణ్.

ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో తొలి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఆ చిత్రం ఆయనకు మరిన్ని సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ఆ విధంగా సినిమా చూపిస్త మామ అనే చిత్రంలో నటించిన ఈ  హీరో ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాడు.దాదాపుగా స్టార్ అయిపోయాడు అనుకున్న సమయంలో ఆయన హీరోగా చేసిన మూడవ సినిమా కుమారి 21ఎఫ్ చిత్రం కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

 దాంతో స్టార్ హీరో అయినా ఇంత పని చేశాడు. అలాగే మరొక రెండు మూడు హిట్లు సాధిస్తే తప్పకుండా ఆయన అగ్రహీరోగా ఎదుగుతాడు అని అందరూ భావించారు కానీ ఆయన సినిమాల ఎంపికలో లోపాలు అప్పటినుంచి మొదలయ్యాయి.. తన ఏజ్ కి తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు సినిమాలు ఎంపిక చేసుకోకుండా ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో సినిమాలు చేస్తూ వెళ్లి రాజ్ తరుణ్ తన కెరీర్ను ప్రమాదంలో పడ వేసుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన స్టాండప్ రాహుల్  అనే సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. దాంతో ఈ హీరో రూటు ఎందుకు మార్చకుండా అదే తరహాలో సినిమాలను చేస్తున్నాడు అని కొంతమంది వాపోతున్నారు. ఇక నిర్మాత విషయానికి వస్తే ఈ హీరోతో సినిమా చేయడం కంటే కొత్త హీరో తో సినిమా చేయడం మంచిదని వారు భావిస్తున్నారు. మరి తనను తాను హీరోగా నిలబెట్టుకోవడానికి ఈ హీరో ఏ విధమైన ప్రయత్నాలు చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: