బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే హీరోగా సత్తా చాటిన సల్లూభాయ్.. ఇటీవల నిర్మాతగా కూడా మరి కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి అక్కడ కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నారట ఈ కండలవీరుడు. ఈవార్త ప్రస్తుతం బీటౌన్ ఫిలిం దునియాలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ తన నటనతో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సల్మాన్ ఖాన్ దర్శకుడిగా కూడా తానేమిటో నిరూపించుకోవాలి అనుకుంటున్నాడట.

ఈ నేపథ్యంలో త్వరలోనే సల్మాన్ ఖాన్ ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని.. అందుకు అంతా కూడా సిద్ధమైందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో  'కబీ ఈద్ అభి దివాలి' అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు మరో నిర్మాత గా ఉన్న సాజిద్ నడియావాలా ఇటీవల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దీంతో ఏకైక నిర్మాతగా ఉన్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సల్మాన్ ఖాన్ సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గత 4 - 5 ఏళ్లుగా తన సినిమాలకు గెస్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ అనుమతి లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా అవుట్ ఫుట్ లో కి రాదు అని అంటున్నారు అతని సన్నిహితులు. సల్మాన్ ఖాన్ జోక్యం కారణంగానే సంజయ్ లీలా భన్సాలీ తో అతనికి విభేదాలు వచ్చాయని.. దాని ఫలితంగా వీరిద్దరి 'ఇన్సా అల్లా మూవీ ఆకస్మాత్తుగా నిలిచిపోయిందని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన సినిమాకు ఇదే రిపీట్ కావటంతో నేరుగా తానే దర్శకత్వ బాధ్యతను తీసుకోవాలని అనుకున్నాడట సల్మాన్ ఖాన్.ఇక ప్రస్తుతం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఫర్హాద్ సంజీవ్ కో డైరెక్టర్ గా వ్యవహరిస్తాడు అనే టాక్ వినిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: