టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  విశ్వక్ సేన్ ,  తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత విశ్వక్ సేన్  హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'హిట్'  బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఫలక్ నామ దాస్,  పాగల్ మూవీ లు  విశ్వక్ సేన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తీసుకువచ్చాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కళ్యాణం'  అనే  మూవీ లో హీరోగా నటించాడు.  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌ లో విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ మూవీ ని నిర్మించారు.  ఈ మూవీ లో  విశ్వక్ సేన్  సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌ గా నటించింది.

 రాజాగారు రాణివారు మూవీ దర్శకుడు  రవి కిరణ్ కోలా అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ కి కథ, మాట‌లు, స్ర్కీన్‌ ప్లే ను అందించారు. ఇది ఇలా ఉంటే తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల లో భాగంగా జరిగిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ... అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ  చేయడం నిజంగా నా అదృష్ట‌ం. ఎందుకంటే రీసెంట్‌ గానే ఈ మూవీ ని  చూశాను.  ఇప్ప‌టి వ‌ర‌కు నేను చెప్ప‌లేదు , కానీ ,  ఇప్పుడు చెబుతున్నా .. నా కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అశోకవనంలో అర్జున కళ్యాణం అవుతుంది అని ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేన్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: