గత వారం రోజుల నుండి ఎవరి నోట విన్నా కెజిఎఫ్ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఈ రోజుల్లో వచ్చిన ఒక మాస్ ఆణిముత్యం అని చెప్పాలి. ఈ సినిమాను చూసిన వారెవరూ కూడా నచ్చలేదు అన్న మాట అనలేదు అంటే సబ్జెక్టు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కెజిఎఫ్ లో భాగంగా ఇప్పటికి రెండు పార్ట్ లు రిలీజ్ అయ్యాయి. రెండు పార్ట్ లు కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ బిగ్గెస్ట్ ప్లస్ అయింది అని చెప్పాలి. దీనితో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమా గురించి? ఇందులో చేసిన నటీనటుల గురించి ? టెక్నికల్ టీమ్ గురించి ? ఇలా పలు రకాల చర్చలు జోరుగా సాగుతున్నాయి. అదే విధంగా ఇప్పుడు మరొక విషయం వైరల్ గా మారింది.

కెజిఎఫ్ చాప్టర్ 1 లో కేవలం యశ్ ఏ విధంగా కెజిఎఫ్ కు వచ్చాడు, ఎలా అక్కడ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుని తన సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి జనాన్ని రెడీ చేసుకున్నాడు... ఆ తర్వాత కెజిఎఫ్ ను చెప్పుచేతుల్లో పెట్టుకున్న గరుడను చంపి కెజిఎఫ్ ను తన హస్తగతమ్ చేసుకున్నాడు అన్న విషయాలు చూపించారు. ఇందులో గరుడ కు కొని సన్నివేశాలు మాత్రమే ఉన్నా అందరినీ ఈ పాత్ర బాగా ఆకట్టుకుంది. అయితే గరుడ అసలు ఈ సినిమాలో ఎలా పార్ట్ అయ్యాడు అన్నది మీకు తెలుసా? వాస్తవానికి గరుడ అనబడే రాంచంద్రరాజు హీరో యశ్ కి కార్ డ్రైవర్ మరియు బాడీ గార్డ్ అట. అయితే కథ గురించి చర్చించడానికి యశ్ మరియు ప్రశాంత్ నీల్ లు తరచూ కలుస్తున్న సమయంలో ప్రశాంత్ నీల్ చూపు రామచంద్రరాజు పై పడింది... చూడడానికి గంభీరంగా బాడీ కూడా బలిష్టంగా ఉండడంతో ఒకరోజు డైరెక్ట్ గా అతనితోనే నా సినిమాలో విలన్ గా నువ్వు అయితే సరిపోతావు.. చేస్తావా అన్నాడట ?

అయితే రాము దీనికి అతనేదో తమాషాగా అన్నాడని ఊరుకున్నాడట. అయితే షూటింగ్ రోజుల డైరెక్ట్ గా ఫోన్ చేసి వచ్చి నటించు అనగానే షాక్ అయ్యాడట రాము. అయితే ఈవిషయాన్ని ముందే ప్రశాంత్ నీల్ యశ్ కి చెప్పి ఒప్పించాడట, అలా యశ్ డ్రైవర్ తనకు విలన్ గా మారాడు. దీనితో ఈ విషయం తెలిసిన వారంతా పక్కలో బల్లెం పెట్టుకున్నావు జాగ్రత్త యశ్ అంటూ ట్రోల్ చేస్తున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: