ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అందరూ హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయి కలిగిన సినిమాలు చేసి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నారు. చిన్న హీరో లు సైతం ఈ తరహా సినిమాలు చేయడంలో ఏమాత్రం వెనకాడడం లేదు. దాంతో కొద్దో గొప్పో క్రేజ్ ఉన్న హీరోలు సైతం సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను దక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

అలా పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో అడివి శేష్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తో అందరినీ అలరించడానికి సిద్ధం అవుతున్నారు. క్షణం సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్న నటుడు ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకునే ఎన్నో విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. వెరైటీ సినిమాలను చేసే హీరోగా ఉన్న ఈ హీరోతో సినిమాలు చేయాలని అగ్ర దర్శకులు సైతం పోటీపడ్డారు. ఆ విధంగా ఇప్పుడు మేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా తనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని భావిస్తున్నాడు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ సినిమా ద్వారా ఆయనకు కేవలం విజయం మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా రావాలని భావిస్తున్నారు. ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది అని అడివి శేష్ కూడా భావిస్తున్నాడు అని చెబుతున్నారు. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. గతంలో ఈ ఇద్దరి కాంబినే షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మరి ఈ చిత్రం ఆ స్థాయి లో విజయాన్ని అందుకున్తుండా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: