గోపీచంద్ హీరోగా నటించిన ఫస్ట్ సినిమా తొలివలపు. ఈ సినిమాలో చాలా యంగ్ గా ఇంకా హ్యాండ్ సమ్ లుక్ లో రొమాంటిక్ హీరోగా సినీ ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా పర్లేదు అనిపించింది. అయితే, అప్పుడు ఈయన గురించి చాలా మందికి కూడా తెలియదు. కానీ.. ఇక ఆ తర్వాత నటించిన జయం సినిమాతో..గోపీచంద్ అందరికి కూడా ఫేవరేట్ విలన్ గా మారిపోయాడు. జయం సినిమాలో ప్రతి నాయకుడిగా మారి అందరికి కూడా షాక్ ఇచ్చారు గోపిచంద్.అస్సలు విలన్ రోల్ ఎందుకు చేశాడో కూడా అప్పుడు తెలియదు. గోపీచంద్ లుక్స్ అయితే హీరో గా బాగుంటాయి. ఆ హైట్ ఆ వెయిట్ ఇంకా ఆ కోపం..ఆయనకి బాగా సెట్ అవుతాయి. కానీ, ఎందుకో విలన్ గా సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఆ తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా నటించిన నిజం సినిమాలో విలన్ గా చేసాడు, ఆ తరువాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరో గా నటించిన వర్షం సినిమాలో కూడా విలన్ గా నటించి అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసాడు హీరో గొపీచంద్. ఇక ఆ సినిమాల్లో హీరో పాత్రకి సరి సమానంగా..ఆయన పెర్ఫార్మన్స్ కి కూడా న్యాయం చేసి సినిమా విమర్శకులు సైతం ఫిదా అయ్యేలా చేశారు.ఇక ఆ తరువాత మళ్ళీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే..మంచి మంచి సినిమా ఆఫర్లను కూడా వదులుకుని..హీరో సినిమాలు చేయడానికి కూడా ట్రై చేశాడు .



ఆయన మీద నమ్మకంతో డైరెక్టర్లు కూడా గోపీచంద్ కు ఎన్నో అవకాశాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. రణం, లౌక్యం, గోలిమార్ తప్ప పెద్ద హిట్ సినిమాలు లేవు. లౌక్యం చేసిన తరువాత ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొడుతూ వచ్చింది. ఇక ఆ తరువాత చాలా కాలానికి..సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కిన సిటీమార్ సినిమాలో హీరో గా నటించి..ఫైనల్ గా హీరో గా ఒక యావరేజ్ హిట్ కొట్టాడు గోపీచంద్.కాగా గోపి చంద్ కెరీర్ మొదట్లోనే తన హీరోలుగా కంటీన్యూ అయ్యున్నా ఈరోజు ఇంత ప్రాబ్లమ్ ఉండేది కాదు. పోనీ హీరో గా కాకుండా విలన్ రోల్ నే సెలెక్ట్ చేసుకుని ఉన్న..ఇప్పుడు అసలు గోపి చంద్ కధ వేరేగా ఉండేది. ఖచ్చితంగా ఆయన టాలెంట్ కి, లుక్స్ కి ఇంకా డెడికేషన్ కి..ఇప్పుడు స్టార్ సెలబ్రిటీల రేంజ్ లో ఆయన ఉండేవాడు.ఇక ఇప్పుడైనా యాక్టర్ గా ఆయన సూపర్ అనుకోండి. కానీ ఇంకా స్టార్ స్టేటస్ దక్కించుకోలేదు. కేవలం చిన్న తప్పు గోపీచంద్ జీవితాన్ని ఇలా తలకిందులు చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: