టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోల లో నాగచైతన్య ఒకరు. నాగ చైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమా లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. అలాగే ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

అలాగే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్ద మూవీలో నటిస్తున్నాడు. అలాగే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నాగ చైతన్య నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తున్న నాగ చైతన్య తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే అనేక మంది డైరెక్టర్ లను లైన్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్న మూవీ ల తర్వాత నాగ చైతన్య  దర్శకుడు వెంకట్ ప్రభు ,  నందిని రెడ్డి దర్శకత్వంలోనూ నటించబోతున్నాడు.  వీరితో పాటు నాగ చైతన్య తదుపరి సినిమాల దర్శకుల లిస్ట్ లో కిశోర్ తిరుమల, రాహుల్ సాంకృత్యాయన్, విజయ్ కనకమేడల లాంటి వారు కూడా ఉన్నారు. వీరందరితో పాటు నాగ చైతన్య , పరశురామ్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ లో నటించడానికి ఇప్పటికే కమిట్ అయ్యాడు. దర్శకుడు పరశురామ్,  నాగ చైతన్య తో నాగేశ్వరరావు అనే మూవీ ని తెరకెక్కించబోతున్నడు.

నిజానికి ఇంతకు ముందే నాగ చైతన్య తో పరుశురామ్సినిమా చేయాలనుకున్నాడు. స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. కానీ అదే సమయంలో పరశురామ్ , మహేశ్ బాబు  కు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ రావడంతో దర్శకుడు పరుశురామ్, మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీ ని తెరకెక్కించాడు. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కావడంతో త్వరలోనే నాగ చైతన్య తో పరశురామ్ సినిమా మొదలు పెట్టబోతున్నడు. నాగచైతన్య తదుపరి దర్శకుల లిస్టులో తరుణ్ భాస్కర్ కూడా ఉన్నాడు. ఇలా నాగ చైతన్య ప్రస్తుతం అరడజన్ మందికి పైగా దర్శకులను లైన్ లో పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: