టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన అడవి శేషు తాజాగా మేజర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన మేజర్ సినిమా నిన్న అనగా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయ్యింది . 

మూవీ కి విడుదలైన మొదటి రోజు నుండే విడుదలైన అన్ని ప్రాంతాల నుండి అదిరి పోయే పాజిటివ్ టాక్ లభించడంతో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లు కూడా లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ మేజర్ మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా మేజర్ మూవీ ని చూసిన దర్శకుడు హరీష్ శంకర్ మేజర్ మూవీ చాలా అరుదైన సినిమా అని చెప్పుకొచ్చారు .

అడివి శేష్ చాలా బాగా చేశారు అని, శశి కిరణ్ తిక్కమూవీ ని చాలా బాగా తెరకెక్కించారు అని హరీష్ శంకట్ చెప్పుకొచ్చారు . అంతే కాక ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లు ప్రత్యేకంగా ఉన్నాయి అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. మేజర్ మూవీ లో సాయి మంజ్రేకర్, ధూళిపాల కీలకమైన పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ , రేవతి , మురళి శర్మ , అనిష్ కరివిల్లా ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. అడవి శేషు , శశికిరణ్ తిక్క కాంబినేషన్ లో ఇది వరకే గూడచారి సినిమా తెరకెక్కి మంచి విజయం సాధించింది.  మేజర్ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: