సినిమా ఫలితాలను ఎవరు ఖచ్చితంగా ఊహించలేము. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదల అయిన పలు స్టార్ హీరోల చిత్రాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ దాఖలాలు ఎన్నో. అలాగే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అంతంతమాత్రంగా పబ్లిసిటీ పెట్టుకుని రిలీజ్ అయిన కొన్ని చిన్న హీరోల చిత్రాలు చరిత్ర సృష్టించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇలా ఏ సినిమా ఎవరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో ఎవరు ఊహించలేము. సినిమాల ఫలితాలపై నటీనటులు, దర్శక నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు లు ఇలా ఎంతోమంది ఆధారపడి ఉంటారు.

అయితే వచ్చే రిజల్ట్ మాత్రమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. మూవీ హిట్ అయితే ఇక చెప్పనక్కర్లేదు.. వీరంతా నక్క తోక తొక్కినట్టే లేదంటే అందరూ కూడా నష్టపోవాల్సి ఉంటుంది.  అయితే సినిమా ఫ్లాప్ అయితే వచ్చే నష్టాల గురించి తనకు నష్టం తెచ్చిపెట్టి ఆర్దికంగా కుంగిపోయేలా చేసిన చిత్రాల గురించి  తన అనుభవాలను చెప్పుకొచ్చారు ప్రముఖ టాలివుడ్ దర్శకుడు, నిర్మాత అయిన పి.ఎన్.రామచంద్ర రావు.  తాజాగా ఒక ఇంటర్వ్యూ కి హాజరు అయిన ఈయన కొన్ని సంచలన విషయాలను చెప్పారు. మహేష్ బాబు సినిమాతో ఈయన  డిస్ట్రిబ్యూటర్ గా మారి తన అనుభవాలను ఇలా పంచుకున్నారు. బిజినెస్ మ్యాన్ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా మారి తన సినీ కెరియర్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

అయితే తనను డిస్ట్రిబ్యూటర్ గా ముగ్గురు హీరోల చిత్రాలు ఘోరంగా దెబ్బతీసాయని అన్నారు. వాటిలో భారీ నష్టం తెచ్చి పెట్టిన చిత్రం తుఫాన్.   రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని  దాదాపుగా రూ.12 కోట్ల రూపాయలు పోసి హక్కులను కొనుగోలు చేస్తే వసూళ్లు మాత్రం రూ.7 కోట్ల రూపాయలకే క్లోజ్ అవడంతో భారీ నష్టం వాటిల్లింది.  అలా చాలా నష్టపోయామని అన్నారు.  ఇక ఆ తరవాత అక్కినేని హీరో నాగచైతన్య నటించిన దోచెయ్ సినిమాకి కూడా నేను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించగా అది కూడా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది అన్నారు. అదే విధంగా ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఒంగోలు గిత్త సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా బాధ్యతలు తీసుకున్నాను. అయితే  ఈ సినిమా రిజల్ట్ ఏకంగా నా కెరియర్ పైన తీవ్రంగా ప్రభావం  చూపించింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పుడే ఇకపై డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించ కూడదని నిర్ణయించుకుని పులుస్టాప్ పెట్టానని ఆయన అన్నారు. అయితే ఇండస్ట్రీ నాకు చాలా నేర్పించింది థియేటర్ ను నడిపించడం తప్ప అవకాశం వచ్చిన అన్ని పనులను  చేశాను అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: