వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు కమల్ హాసన్. ఈయన చిత్రం విడుదలై ఇప్పటికి నాలుగు సంవత్సరాలు కావస్తోంది ఈ నేపథ్యంలో ఆయన నటించిన తాజా చిత్రం విక్రమ్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది. డైరెక్టర్ లోకేష్ కనక రాజ్ ఈ సినిమాని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. డైరెక్టర్ ,కమల్ హాసన్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు ఇందులో కీలక పాత్రలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి వారు నటించారు.


జూన్ 3వ తేదీన అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. ఇందులో హీరో సూర్య కూడా కీలకమైన పాత్రలో నటించి మెస్మరైజ్ చేశారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరో కమల్ కు వీరాభిమాని అవ్వడంతో మరి ఇంత పవర్ఫుల్ గా చూపించిన ఈ సినిమాను సక్సెస్ బాట పట్టేలా చేశారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఒక రా ఏజెంట్లుగా చేసిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. కమల్ హాసన్ ని చూపించిన తీరు చూస్తే ఆయన అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలై రూ.100  కోట్ల రూపాయల రాబట్టింది. 4 ఏళ్ల విరామం తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకుడికి కమల్ హాసన్ గుర్తు గా ఉండేందుకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ని అందించారు. ఈ విషయాన్ని డైరెక్టరే స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. లెక్సి యస్ అనే కారణం డైరెక్టర్ కి కమల్ హాసన్ బహుమతిగా ఇచ్చారు దీని ధర అక్షరాలా రూ.2.5 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు కమలహాసన్ ఒక ఎమోషనల్ లెటర్ ని కూడా డైరెక్టర్కి అందించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: