బాలీవుడ్ ఇండస్ట్రీ లో కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే ఏ హీరోకి లేని ఓవర్సీస్ మార్కెట్ షారుఖాన్ కి ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేయడంలో షారుక్ ఖాన్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో సినిమాలు తీస్తుంటాడు. ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాల నుండి షారుక్ ఖాన్ స్టామినాకి తగ్గ  హిట్ లేదు. ఆ హిట్ కోసం తెగ తాపత్రయ పడుతున్నాడు ఈ బాలీవుడ్ హీరో. ఇదిలా ఉంటే ఇండియాలో భారీ క్రేజ్ కలిగిన షారుఖ్ ఖాన్ తో సినిమా చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలియజేయడం జరిగింది.

చిన్నతనం నుంచే షారుక్ ఖాన్ సినిమాలు చూస్తూ పెరగడం జరిగిందని.. షారుఖాన్ కి తాను అతి పెద్ద అభిమానిని అని..తన కెరీర్లో షారుక్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటానని..ఎందుకంటే అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఒకసారి మాత్రమే కాదు అవకాశం వచ్చి సరైన స్క్రిప్టు దొరికితే రణబీర్ కపూర్ తో కూడా నటిస్తానని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.ఇక తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే ఇంటర్వ్యూలో భాష గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ..' ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలు అన్నీ కూడా ఉత్తరాది ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.

నేను స్కూల్ చదివేరోజుల్లో అమీర్ ఖాన్ నటించిన లగాన్ విడుదలైంది. సౌత్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా ఎక్కడైనా సత్తా చాటడం లో సినిమాలో ఉండే కంటెంట్ బట్టి ఉంటుంది. త్రిపుల్ ఆర్, కేజిఎఫ్, బాహుబలి2 మరియు లగాన్ వాటిని రుజువు చేయడం జరిగింది. మన దేశ ప్రేక్షకులు ఏ భాష అని లేదు సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారని, ఈ సినిమాలు దేశ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వరుణ్ తేజ్ తన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.ఇటీవల ఎఫ్3 సినిమాతో వరుణ్ తేజ్ మరో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: