కోలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయిన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్  కలెక్షన్లను కొల్లగొడుతుందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 25 రోజులు పూర్తి అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ ల జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించగా విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించారు. విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూన్ 3 వ తేదీన విడుదల అయ్యింది.  ఈ మూవీ కి విడుదలైన మొదటి షో నుండే అదిరిపోయే బ్లాక్బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను అందుకున్న విక్రమ్ సినిమా జూలై 8 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన పాటలకు అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా విక్రమ్ మూవీ నుండి పాతాళ పాతాళ అనే మాస్ సాంగ్ ఫుల్ వీడియోని యూట్యూబ్ లో చిత్ర బృందం విడుదల చేసింది. విక్రమ్ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ అందించిన పాటలు అన్ని కూడా ప్రేక్షకులను ఎంత గానో  అలరించినప్పటికీ , మరీ ముఖ్యంగా పాతాళ సాంగ్ అయితే మాస్ మరియు యూత్ ని ఎంత గానో ఆకట్టుకుంది. ఈ మాస్ సాంగ్ ను అనిరుద్  తో కలిసి కమల్ పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: