నితిన్ హీరోగా నటిస్తున్న తాజా పొలిటికల్ యాక్షన్ చిత్రం మాచర్ల నియోజవర్గం. ఈ సినిమాని శ్రేష్టు మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నీకితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి కొత్త దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్లుగా కేథరిన్, కృతి శెట్టి నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఆగస్టులో విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలోని ఈ సినిమాల ఒక స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేయడం జరిగింది.


ఇప్పటికే విడుదలైన మాచర్ల నియోజవర్గం మంచి ఆదరణ లభిస్తున్నది. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన టీజర్ ఈ సినిమా పైన అంచనాలను పెంచేసాయని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా పైన నెత్తిన అభిమానులు భారీగానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లు హీరో నితిన్ అంజలి పై చిత్రీకరించడం జరిగింది. రారా రెడ్డి ఐ యామ్ రెడీ.. అంటూ సాగేటువంటి పాటకి లిరికల్ వీడియోని నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది.ముందుగా ఈ సాంగ్ ని శ్రీకాకుళంలో ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు కానీ అకాల వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులోని మకాం మార్చారు.


ప్రస్తుతం ఈ పాట నేర్పింట వైరల్ గా మారుతోంది. ఈ పాటకు జానీ మాస్టర్ తనదైన శైలిలో స్టెప్పులు వేయించారని చెప్పవచ్చు మీకు ఈ పాటకి అంజలి గ్లామర్ కూడా కాస్త యాడ్ అయింది అని చెప్పవచ్చు. చివరిగా సరైనోడు సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన అంజలి ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అదే ఘాటు అందాలతో ఈ సినిమాలో రచ్చ చేసిందని చెప్పవచ్చు. చివరిగా జయం సినిమాలోని ఒక లైన్ పెట్టడం అద్భుతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: