తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈయనకు ప్రత్యేకమైన ఒక స్టైల్ ఉందని చెప్పవచ్చు. ఆ స్టైల్ తోనే ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోగా పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ దర్బార్ చిత్రం విడుదల ఎన్నో సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత విడుదలైన చిత్రం పెద్దన్న ఈ చిత్రం పెద్దగా తమ అభిమానులపై ప్రేక్షకులపై ప్రభావం చూపలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పవచ్చు.


ఇక రజనీకాంత్ సినిమా వస్తోందంటే చాలు ఎంతోమంది ఉత్తరాది, జపాన్, కొరియా దేశాలలో సెలవు పెట్టి మరి సినిమాలను చూస్తూ ఉంటారు అంత గొప్పగా పేరు పొందాడు రజనీకాంత్. అందుకే రజనీకాంత్ లాంటి స్టార్ ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఈయన తదుపరి చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి ఇలాంటి సమయంలో రజినీకాంత్ ఎలాంటి సినిమా మాతో రాబోతున్నారా అన్న వాటిపై తాజాగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రజినీకాంత్ టీమ్ నుండి తాజాగా ఒక ప్రకటన బయటికి రావడం జరిగింది.


రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులోనే సెట్ చేయబోతున్నట్లు సమాచారం. 2021 యాక్షన్ రాము పెద్దన్న చిత్రం తర్వాత రజనీకాంత్ అభిమానులు తన నెక్స్ట్ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ వార్త తెలిసిన రజిని అభిమానుల సైతం కాస్త సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా టైటిల్ జైలర్ గా ఉందనే ఉద్దేశంతోనే డైరెక్టర్ నెల్సన్ రజినీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: