ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమలలోను విడాకులు ఎక్కువైపోయాయి.ఇటీవల  బాలీవుడ్ లో అమీర్ ఖాన్ దంపతులు, ఇక్కడ నాగచైతన్య-సమంత, కోలీవుడ్ లో ధనుష్-ఐశ్వర్య..ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూడా విడాకులు తీసుకోబోతున్నాడని సమాచారం. అయితే నీకోసం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీనువైట్ల ఆ తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్షా… లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. కాగా టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలబడ్డాడు.ఇకపోతే స్వచ్ఛమైన కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా శ్రీను వైట్ల ఉండేవారు.

 అయితే ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన శ్రీనువైట్ల గత కొంతకాలంగా విజయాలు లేక డీలా పడిపోయాడు.కాగా  శ్రీనువైట్ల చివరి మూడు సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. పోతే 2018లో చివరి సారిగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీను. ఇక ఆ సినిమా పరాజయం పొందడంతో ఇప్పటివరకు ఇంకో సినిమా తీయలేదు.ఇకపోతే  హిట్ కొట్టి చాలా కాలం అవ్వడంతో స్టార్ డైరెక్టర్స్ రేసులోంచి కూడా పక్కకెళ్ళిపోయాడు. కాగా తన హిట్ సినిమాల్లో ఒకటైన ‘ఢీ’కి సీక్వెల్ గా మంచు విష్ణుతో సినిమా తీయాలని చూస్తున్నాడు.పోతే  సినిమా ప్రకటించినా ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు.ఇకపోతే  ఇటీవల శ్రీనువైట్ల భార్య రూపాతో విడిపోతున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది.కాగా  రూపా ఫ్యషన్ డిజైనర్. కొన్ని సినిమాలకి కూడా ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది.

 అయితే స్వయంగా వేదిక్‌ అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌ తో బిజినెస్ కూడా చేస్తుంది. ఇక శ్రీనువైట్ల, రూపాలది ప్రేమ వివాహం. ఇదిలావుంటే గత కొంతకాలంగా శ్రీనువైట్ల సక్సెస్ లో లేకపోవడం, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం, ఆర్ధిక సమస్యలు ఉండటంతో రూపా శ్రీనువైట్లతో విడాకులు కోరినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా గతంలోనూ వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఇక శ్రీనువైట్ల వేధిస్తున్నాడని రూప కేసు కూడా పెట్టింది. అయితే చాలాకాలం క్రితమే వీరిద్దరు విడాకులు తీసుకోవాలని భావించినా రూపా పేరెంట్స్‌ నచ్చజెప్పడంతో కొన్నాళ్లు కలిసి ఉన్నారని, కానీ తాజాగా విడాకులు తీసుకోవడానికే ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇకపోతే నఇప్పటికే శ్రీనువైట్ల భార్య రూపా నాంపల్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం. కాగా 2003లో వీరి పెళ్లి జరగగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇదిలావుంటే  వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నా వీరు మాత్రం స్పందించట్లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: