మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్ సేన్ 33 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కానీ యువకుడి పాత్రలో నటించాడు. కెరియర్ లో మొట్ట మొదటి సారి ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో నటించిన విశ్వక్ సేన్మూవీ లో తన నటనతో ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.

మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా కొంత కాలం నుండే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.  థియేటర్ ప్రేక్షకులను మరియు  'ఓ టి టి'  ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతోంది. ఈ మూవీ శాటిలైట్ హక్కులను తాజాగా జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర లు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించగా , విద్యా సాగర్ చింతా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. జే క్రిష్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా ,   రుక్సర్ ధిల్లాన్, రితిక నాయక్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: