టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'  తర్వాత చాలా గ్యాప్ తీసుకొని లైగర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం  మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ,  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

లైగర్ మూవీ ని పూరి కానక్ట్స్ ,  ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై,  పూరి జగన్నాథ్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక సాంగ్ ను మరియు తాజాగా ఒక ట్రైలర్ ను అలాగే కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ మూవీ నుండి విడుదల చేసిన సాంగ్ కి మరియు ట్రైలర్ కి అలాగే ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన  బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ తమిళ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు సమాచారం. తమిళ హక్కులను అక్కడి ప్రముఖ సంస్థ అయిన స్టూడియో 9 వారు భారీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ్ ఇండస్ట్రీ లో కూడా విజయ్ దేవరకొండ కు మంచి క్రేజ్ ఉండడం వల్ల స్టూడియో 9 వారు లైగర్ మూవీ తమిళ హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: