దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం సినిమా ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో కె మంచి టాక్ రావడంతో బాక్సా ఫీస్ దగ్గర ఈ మూవీ కి అద్భుతమైన రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

సినిమా ఇప్పటి వరకు 5 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 5 రోజులకు గాను సీతా రామం మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం. నైజాం : 3.75 కోట్లు ,సీడెడ్ : 1.03 కోట్లు ,యూ ఏ : 1.38 కోట్లు , ఈస్ట్ : 86 లక్షలు ,వెస్ట్ : 57 లక్షలు , గుంటూర్ : 67 లక్షలు , కృష్ణ : 75 లక్షలు , నెల్లూర్ : 36 లక్షలు . 5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 9.37 కోట్ల షేర్ , 17.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  90 లక్షలు . ఇతర భాషలలో : 2.60 కోట్లు .  ఓవర్ సీస్ లో : 3.60 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు గాను సీతా రామం మూవీ 16.47 కోట్ల షేర్ , 32.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా సుమంత్ , భూమిక చావ్లా  , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రియదర్శి , సునీల్ , ప్రకాష్ రాజ్ , మురళి శర్మమూవీ లో మరి కొన్ని ముఖ్య పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: