ఇక సౌత్ ఇండియా నుంచి వస్తున్న సినిమాలను నార్త్ ఇండియా ఆడియన్స్ ఈమధ్య కాలంలో బాగా ఆదరిస్తున్నారు. 'బాహుబలి' నుంచి మొదలు పెడితే... 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం', 'కెజియఫ్', తాజాగా విడుదలైన 'కార్తికేయ 2' వరకు కూడా ప్రతి సినిమా నార్త్ ఇండియాలో మంచి వసూళ్లు సాధిస్తోంది.ఇక వచ్చే వారం టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందిన 'లైగర్' సినిమా చాలా గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఈ సినిమాపై మాత్రం నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఇప్పుడు బాగా మండి పడుతున్నారు.ఈ 'లైగర్' సినిమాపై నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత రావడానికి రెండు కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి... కరణ్ జోహార్. హిందీ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తర్వాత ఆయనపై చాలా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇంకా సినిమా ఇండస్ట్రీకి చెందిన పిల్లల వారసుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఉత్తరాది ప్రేక్షకులు ఆయన సినిమాలను బాయ్‌కాట్‌ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. 'లైగర్' సినిమా నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు కావడంతో ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్‌ చేయమని ట్విట్టర్ సాక్షిగా కూడా పిలుపు ఇస్తున్నారు. 


ఇక మరొక కారణం... హీరోయిన్ అనన్యా పాండే. సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తెగా ఆవిడ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆమెకు కరణ్ జోహార్ ఆశీసులు కూడా ఉన్నాయి. ఇక ఆమెపై కోపం కూడా సినిమా మీదకు మళ్లిందని చెప్పవచ్చు.అలాగే ఇప్పుడు కొత్తగా మరో వివాదం కూడా మొదలైంది.సినిమాలో 'ఆ... ఫట్', 'అకిడి పకిడి...' పాటలపై కూడా నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. 'ఆ... ఫట్' పాటలో హిందీ లిరిక్స్ అనేవి వివాదానికి కారణం అయ్యాయి. హిందీలో 70లలో వచ్చిన ఒక సినిమాలోని రేప్ సన్నివేశంలో డైలాగులను ఫన్నీగా ఉపయోగించారని ఒకరు  దీని గురించి ట్వీట్ చేశారు. మరి కొంత మంది కూడా లిరిక్స్ మీద అనేక రకాల విమర్శలు అనేవి చేస్తున్నారు.అసలు సాంగ్ కంటే కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ కావడంతో 'బాయ్‌కాట్‌ లైగర్' అనేది చాలా ఎక్కువ ట్రెండ్ అవుతోంది. ఈ వ్యతిరేకతను విజయ్ దేవరకొండ ఎలా డీల్ చేస్తారో చూడాలి.ఇంకా విమర్శలతో పాటు విజయ్ దేవరకొండకు అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది.


హిందీ హీరోలు ఇంకా హీరోయిన్లతో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా ఆయనకు అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక ప్రశంసలు... లేదంటే విమర్శలు... ఏదో ఒక రూపంలో సినిమా వార్తల్లో నిలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యాయి. అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాని షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసినా... ఒరిజినల్ వెర్షన్ కూడా చూసిన నార్త్ ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు విజయ్ ఓవర్ యాక్టింగ్, కరణ్ జోహార్, అనన్యా వల్ల అలాగే పూరీ జగన్నాథ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈ సినిమా అస్సామ్ అయ్యేలా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: