సినిమాలలో కనిపించని కామెడీని ప్రేక్షకులకు పరిచయం చేసి.. సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అందించడం మొదలు పెట్టింది ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం. ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో ఒత్తిడితో కూడిన జీవితం లో జబర్దస్త్ చూస్తే కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు అని బుల్లితెర ప్రేక్షకులు అందరూ భావిస్తూ ఉన్నారు. ఇక ఎప్పుడైనా కాస్త ఒత్తిడి గా ఉన్నా ఉపశమనం పొందేందుకు జబర్దస్త్ స్కిట్ లను చూస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అంతలా జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకుల  అందరి పై ప్రభావం చూపింది అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన వారిని జబర్దస్త్ లోకి తీసుకు వస్తూ వారికి సువర్ణ అవకాశాలు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న అందరికంటే భిన్నంగా కాస్త కొత్తగా సినిమా రివ్యూలు చెప్పే కుర్రాడిని జబర్దస్త్ లోకి తీసుకు వచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా లోకులు కాకులు ఆంటీ ని కూడా జబర్దస్త్ లోకి తెచ్చారు. ఇటీవల విడుదలైన ప్రోమోలో భాగంగా రాంప్రసాద్ స్కిట్ ప్రారంభమవుతుంది.


 ఇంతలో గెటప్ శ్రీను లోకులు కాకులు ఆంటీ గెటప్ వేసుకొని సెట్ లోకి ఎంట్రీ ఇస్తాడు.  అచ్చంగా ఆమె మేనరిజం దింపేసాడు. అయితే గెటప్ శ్రీను లోకులు కాకులు ఆంటీ గెటప్ లో స్టేజ్ మీదకి వస్తాడో లేదో.. స్టేజ్ వెనకాల నుంచి నిజంగానే లోకులు కాకులు ఆంటీ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా గట్టిగా అరుస్తారు.. ఇక ఆ తర్వాత తనదైన శైలిలో కామెడీ పంచుతూ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది ఆమె. జబర్దస్త్ లోకి లోకులు కాకులు ఆంటీ రావడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఇక పూర్తి ఎపిసోడ్ చూసేందుకు సిద్ధమైపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: