మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎందుకో ఈయనకు ఈ సంవత్సరం పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి. మాస్ మహారాజా రవితేజ మళ్ళీ పరాజయాల పరంపర కొనసాగిస్తున్నారు. క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు అనుకున్న ఈ హీరో మళ్ళీ ఒకసారిగా యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు కోలుకోలేని దెబ్బలు తీసాయి. మళ్లీ పాత జానెర్ లోకి జారుకుంటున్నాడని తెరపైకి వార్త వస్తోంది . ఇకపోతే ఛాన్స్ ల పరంగా ఈయనకు ఎటువంటి లోటు లేదు.. కానీ సక్సెస్ కి మాత్రం దూరం అవుతున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలలో నటిస్తున్నాడు.

టైగర్ నాగేశ్వరరావుని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తుండగా,  మిగతా రెండు చిత్రాలు పూర్తిగా కల్పిత కథలు కావడం గమనార్హం. అయితే వా
తాజా పరిణామాల నేపథ్యంలో రవితేజ కొత్త ప్రయోగాలకు పూనుకుంటున్నాడా అంటే అవుననే చెప్పాలి. ఇటీవల యంగ్ మేకర్ కం సినిమా ఆటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో ఈగిల్ అనే సినిమా చేస్తున్నట్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. టైటిల్ డిఫరెంట్ గా ఉందని ఇదేదో డిఫరెంట్ అటెంప్ట్ అని తెలుస్తోంది. అయితే తాజాగా అదే నిజమని బలమైన ప్రచారం ఒకటి తెరపైకి వస్తుంది .. అతీంద్రియ అంశాలతో కూడుకున్న చిత్రమని సమాచారం.


హాలీవుడ్ లో రెగ్యులర్గా వచ్చే సూపర్ మాన్ సినిమా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇటీవల కాలంలో స్పైడర్ మాన్,  బ్యాట్ మాన్ చిత్రాలు ఇండియన్ స్క్రీన్ మీద బాగా సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇప్పుడే ట్రెండ్ మారుతుంది కాబట్టి కంటెంట్ పరంగా ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి రవితేజ ఈ సినిమాతో వస్తున్నాడు కాబట్టి కనీసం ఈ సినిమాతో నైనా సక్సెస్ అవుతాడా అని ఆందోళన కూడా అభిమానులలో లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: