బాలకృష్ణలో మరొక యాంగిల్ చూపించి.. ప్రేక్షకులను బాగా ఉర్రూతలూగించిన షో ఏమిటంటే..అన్ స్టాఫబుల్ అని చెప్పవచ్చు.. ఆహా ఓటీటి లో ఈ షో స్త్రిమ్మింగ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ షో కి సీక్వెల్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది.. అందుకోసం బాలయ్య అభిమానులు సినీ ప్రేక్షకుల సైతం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆహా ఓటిటి వారు కూడా అన్ స్టాఫబుల్ -2 షో కు సంబంధించి పనులు కూడా ప్రారంభమైనట్లు తెలియజేశారు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల చివరి వారంలో వచ్చే నెల మొదటి వారంలో అన్ స్టాఫబుల్ -2 షో ప్రారంభమయ్య అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.



కానీ టాలీవుడ్ నిర్మాతలు బంద్ కారణంగా ఈ షో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో తెలుపుతున్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణ తన 107వ సినిమాలు పూర్తి అయిన వెంటనే అన్ స్టాఫబుల్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉండడంతో టాలీవుడ్ నిర్మాతల బంధు కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా కాస్త ఆలస్యంగా అవుతోందని చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి షూటింగ్ ప్రారంభించుకోవచ్చని నిర్మాతలకు తెలియజేయడం జరిగింది.


సెప్టెంబర్ మూడవ వారంలో ఈ చిత్రం షూటింగ్ ముగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత అక్టోబర్ నెలలోనే బాలయ్య అన్ స్టాఫబుల్ -2  షో ని మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీజన్ మొదటి ఎపిసోడ్ లో చివరి ఎపిసోడ్ లో చూపించిన విధంగా చిరంజీవి హాజరయ్యే అవకాశం ఉందని ఆహా వర్గాల నుంచి సమాచారం అందుతున్నది.. మరి ఈసారి సీజన్లో ఏ ఏ నటులను తీసుకువస్తారో చూడాలి మరి. ఇక ఈ సీజన్ కి బాలయ్య రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: