విలక్షణ నటుడు ఎన్నో అవార్డుల గ్రహీత చియాన్ విక్రమ్ నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. తన నటనా జీవితంలో ఎన్నో మైలు రాయిలను అందుకున్నాడు. తనకు నటుడిగా మంచి పేరును తీసుకువచ్చిన సినిమాలలో ఎప్పుడూ అపరిచితుడు మరియు ఐ లు ముందుంటాయి. అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా విక్రమ్ కు హిట్ లు లేకపోవడం తన అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది అని చెప్పాలి. అందుకే ఈ సారి సరికొత్త కథాంశాన్ని ఎంచుకుని నిన్న వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకు కోబ్రా అనే క్యాచీ టైటిల్ తో వచ్చాడు విక్రమ్. ఈ సినిమాను జ్ఞానముత్తు అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ మరియు పాటలతో అంచనాలను పెంచింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం నిరాశగా థియేటర్ ల నుండి వెళుతున్నారు. మంచి కథను ఎంచుకున్నా ఎందుకో అణువణువునా దర్శకత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో ప్లస్ లను పక్కన పెడితే మైనస్ లా గా మరికొన్ని అంశాలు ఇవే,

డైరెక్టర్ కావొచ్చు లేదా హీరో విక్రమ్ కావొచ్చు ఇందులో గెట్ అప్స్ పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కథానుగుణంగా గెట్ అప్స్ ఉండాలి, కానీ విక్రమ్ ఉన్నాడు కదా అని గెట్ అప్స్ పెట్టడం సరికాదు.

ఇందులో ద్విపాత్రాభినయం చేసిన విక్రమ్ మది మరియు కోబ్రా పాత్రలలో ఒదిగిపోయాడు. కానీ ఒక పాత్ర కోసం మరో పాత్ర ను తక్కువ చేయడం కూడా మైనస్ గా మారింది. ముఖ్యంగా మది పాత్ర ప్రేక్షకులకు పరీక్ష పెట్టింది.

కాగా ఇందులో హీరోయిన్ గా నటించిన కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఆకట్టుకోలేకపోయింది. పైగా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో సాగదీత ఎక్కువగా ఉంది.

విలన్ గా చేసిన ఇర్ఫాన్ పఠాన్ కూడా పూర్తిగా తేలిపోయాడు. ఈయన కన్నా జూడీ పాత్ర ఆకట్టుకుంటుంది.

మ్యూజిక్ లెజెండ్ ఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం పై పెట్టినంత శ్రద్ధ పాటలపై పెట్టలేదు.

మొత్తంగా చూస్తే సినిమా నిండా విక్రమ్ మాత్రమే కనిపిస్తాడు. మిగిలిన విషయాలపై డైరెక్టర్ ఎందుకు శ్రద్ధ చూపలేదు అన్నది ఆయనకే తెలియాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: