అందాల ముద్దుగుమ్మ శ్రీ నిధి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మడలింగ్ రంగం నుండి సినిమా రంగంలోకి వచ్చింది. శ్రీ నిధి శెట్టి , యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కే జి ఎఫ్ తో వెండితెరకు పరిచయం అయ్యింది. కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

ఆ తరువాత శ్రీ నిధి 'కే జీ ఎఫ్ చాప్టర్ 2' మూవీ పై తన ఫుల్ ఫోకస్ పెట్టింది. కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ చిత్రీకరణ దశలో ఉండగా ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే క్రమంలో ఈ ముద్దుగుమ్మకు ఎన్నో మూవీల నుండి అవకాశాలు వచ్చినప్పటికీ శ్రీనిధి శెట్టి మాత్రం కోబ్రా మూవీ విజయం తర్వాత అదిరిపోయే క్రేజీ మూవీ అవకాశాలు దక్కుతాయి అనే ఉద్దేశంతో  ఆ ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ఇలా కే జి ఎఫ్ చాప్టర్ 2 తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నటించిన కోబ్రా మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. కోబ్రా మూవీ కనుక మంచి విజయం సాధిస్తే ఆ తర్వాత భారీ క్రేజీ మూవీ అవకాశాలు దక్కుతాయి అనుకున్నపటికి కోబ్రా మూవీ ఈ ముద్దుగుమ్మ ఆశలను ఆవిరి చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: