ఉప్పెన,కొండ పొలం వంటి సినిమాతో మెగా మేనల్లుడు హీరోగా అనిపించుకున్న తాజాగా రంగ రంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ చిత్రాన్ని తమిళంలో అర్జున్ రెడ్డి తెరకెక్కించిన గిరిశాయా ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరించారు ఇక ఈ సినిమాల హీరోయిన్ గా కేతిక శర్మ నటించినది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమాని ప్రసాద్ నిర్మించారు. నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెగటివ్ టాక్ ను మూట కట్టుకుంది. దీంతో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు మాత్రం అంత ఆశాజనకంగా లేవని చెప్పవచ్చు. మరి మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-30 లక్షలు.
2). సిడెడ్-10 లక్షలు
3). ఉత్తరాంధ్ర-10 లక్షలు.
4). ఈస్ట్-10 లక్షలు
5). వెస్ట్-6 లక్షలు
6). గుంటూరు-15 లక్షలు
7). కృష్ణ-8 లక్షలు
8). నెల్లూరు-6 లక్షలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే ..95 లక్షల రూపాయలు మొదటి రోజు.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-6 లక్షలు
11). ఓవర్సీస్-7 లక్షలు
12). మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.1.8 కోట్ల రూపాయలు.

ఇక రంగ రంగ వైభవంగా సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.8.12 కోట్ల రూపాయలు జరగకగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.8.5 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది.. అయితే ఈ సినిమా చాలా ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు కేవలం రూ.1.8 కోట్లను మాత్రమే రాబట్టింది. ఈ సినిమా ఇంకా విజయం సాధించాలి అంటే రూ.7.42 కోట్లను రాబట్టాల్సి ఉన్నది. ఇక ఓపెనింగ్ బట్టి చూస్తే ఈ సినిమా ఇంతటి కలెక్షన్లను రాబట్టడం కష్టమే అన్నట్లుగా రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి చివరికి ఈ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: