బాలీవుడ్ మేకర్స్ నుండి వస్తున్న మెగా మూవీ బ్రహ్మాస్త్ర సినిమా కోసం అటు బాలీవుడ్ మరియు టాలీవుడ్ ఎంతగానో ఎదురుచూస్తోంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ గా వస్తున్న ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి తెరకెక్కించారు. పురాణాల నుండి ఈ సినిమా లైన్ ను తీసుకున్నారు. ఈ సినిమా పురాణాలనుండి తీసుకోవడం వలన ఎక్కువ ఆసక్తి ప్రేక్షకులలో కలిగింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ఇందులో ప్రధాన పాత్రలలో రణ్ బీర్ కపూర్ మరియు అలియా భట్ లు నటిస్తున్నారు. ఇక మిగిలిన పాత్రలలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌని రాయ్ మరియు ఇతరులు నటించారు. ఈ సినిమాకు హీరో రణ్ బీర్ కపూర్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. ఇక కరణ్ జోహార్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.  ఈ సినిమా ఎన్నో అంచనాలతో మరో నాలుగు రోజుల్లో థియేటర్ లలో విడుదల కానుంది.

అయితే టీజర్ మరియు ట్రైలర్ లలో చుసిన వరకు ఇది ఒక వి ఎఫ్ ఎక్స్ అధిక ప్రాధాన్యత కలిగిన చిత్రంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సినిమా కోసం పెద్ద వారి కంటే కూడా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. కొందరి ఇళ్లల్లో అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని అడగడం తో మరింత ప్రాధాన్యత కలుగుతోంది. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలలో చూసిన విధంగా విజువల్ ట్రాయిట్ ఉంటుందా అని ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వి ఎఫ్ ఎక్స్ కూడా మోతాదు మించిపోతే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం అని కొన్ని వర్గాల ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు దర్శకుడు అయాన్ ముఖర్జీ.

మరింత సమాచారం తెలుసుకోండి: