టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఇలియానా ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది.మొదట ఈమె  దేవదాసు తో హీరోయిన్ గా పరిచయం అయినా తొలి సినిమా తోనే సాలిడ్ హిట్ అందుకుంది.ఇకపోతే దేవదాస్ మంచి హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అంతేకాదు తక్కువ సమయంలోనే ఇలియానా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తరువాత బ్యాక్ టు బ్యాక్ లతో దూసుకుపోయింది ఈ చిన్నది. అంతేకాదు అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ దక్కించుకుంది ఇలియానా .. తెలుగుతో పటు తమిళ్ లోనూ లు చేసి ఆకట్టుకుంది. బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ సన్నజాజి.

అయితే ఇక  సౌత్ లో కెరీర్ మంచి పీక్ లో ఉండగానే బాలీవుడ్ వైపు అడుగులేసింది.కాగా  ఆ తర్వాత ఇక్కడ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్ కు వెళ్లిన సమయంలో ఇలియానా ప్రేమలో కూడా పడింది.అయితే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది ఈ చిన్నది.కాగా  కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి ప్రేమ ప్రయాణం ఆ తర్వాత బ్రేకప్ కు దారితీసింది.అయితే  ప్రియుడితో విడిపోయిన తర్వాత ఇలియానా డిప్రషన్ లోకి వెళ్ళింది. ఇక అదే సమయంలో బరువు కూడా పెరిగింది. అయితే ఆ తర్వాత లపై దృష్టి పెట్టాలనుకున్నా సక్సెస్ కాలేదు.ఇక  ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరోసారి ప్రేమలో పడిందని తెలుస్తోంది. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా రిలేషన్ షిప్ లో ఉందని టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోకు హాజరయ్యింది కత్రినా కైఫ్.. ఆ టైంలో ఇలియానాతో మీ సోదరుడు సెబాస్టియన్ రిలేషన్ లో ఉన్నారంటగా అని ప్రశ్నించగా.. కత్రినా దాన్ని ఖండించలేదు. ఇక అలా అని కన్ఫామ్ కూడా చేయలేదు. దాంతో ఇలియానా , సెబాస్టియన్ రిలేషన్ పై ఓ కహింట్ వచ్చింది ప్రేక్షకులకు.అంతేకాకుండా  ఇటీవల కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అయితే అక్కడే కత్రినా పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక కత్రినా కుటుంబసభ్యులతో పటు.. ఇలియానా కూడా వారితో జాయిన్ అయ్యింది.ఇకపోతే  ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఇలియానా, సెబాస్టియన్ ఇద్దరు బాంద్రాలో ఓ అపార్ట్మెంట్ లో కలిసి ఉంటున్నారట. అయితే మొత్తంగా గోవా ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలు పడిందని బీ టౌన్ మొత్తం కోడై కూస్తోంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: