యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం లైగర్.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశారు. కానీ ఇందులో అసలు పస లేదు.. రౌడీ హీరో ఉంటే చాలు సినిమా చూస్తారు అనుకుని ప్రేక్షకులకు కనెక్ట్ కాని కథని తీసుకొచ్చి నిర్మాతలు కరణ్ జోహార్ మరియు పూరి ఛార్మి లు చేతులు కాల్చుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన నష్టాలతో ఒక్కసారిగా పూరి జగన్నాథ్ మరియు ఛార్మి ఇంకా కోలుకోలేదు. కట్ చేస్తే ఛార్మి కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇక పూరి కసితో రగిలిపోతున్నాడు.
లైగర్ చిత్రీకరణ సమయంలో పూరి సల్మాన్ తో కానీ, షారుఖ్ తో కానీ సినిమా కోసం అన్నీ సెట్ చేసుకున్నాడు. ఒక కథ చెప్పడమే మిగిలింది.. ఇందుకు సంబంధించిన మంచి కథను కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే అనుకున్నది ఒకటి అయింది మరొకటి.. లైగర్ ఊహించని ఫలితాన్ని ప్లాప్ గా ఇచ్చింది. ఒక్కసారిగా తాను కట్టుకున్న ఊహల కోటలన్నీ మాయం అయ్యాయి. ఇప్పుడు షారుక్ మరియు సల్మాన్ బడా హీరోలు పూరి పై నమ్మకం ఉంచడం కష్టమే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
అయితే పూరి మాత్రం ఎవరో ఒకరికి కథ చెప్పి ఒప్పించి బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆలోచిస్తున్నాడు. మరి పూరి జగన్నాథ్ కు అవకాశం ఇచ్చే హీరో ఎవరా అంటూ సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ బాలీవుడ్ లో ఎవరూ సెట్ కాకపోతే... నందమూరి బాలయ్య ను కలిసి కథ చెప్పడం ఆయన ఓకె చెప్పడం చక చకా జరిగిపోతాయి. కానీ సినిమా పట్టాలెక్కడానికి చాలా కాలం వెయిట్ చేయాలి. ప్రస్తుతం బాలయ్య చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి.. అవన్నీ పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టేలా ఉంది. కానీ పూరి అంత కాలం ఆగలేడు. లైగర్ ప్లాప్ ను మరిచిపోయేలా హిట్ సినిమా తీయాలన్నది ప్లాన్. ఇక ఏ హీరో ఛాన్స్ ఇవ్వని పక్షంలో కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి మంచి హిట్ సినిమా చేయాలని ఆకాంక్ష.. ఇలా పూరి ముందుంది మూడు దారులే... బాలీవుడ్, బాలయ్య మరియు కొడుకు... ఏది సెట్ అవుతుందో చూడాలి.