పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా యొక్క షూటింగ్ శేరవేగం గా జరుపుకుంటుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ను ఏఎమ్ రత్నం నిర్మిస్తూ ఉండగా ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమాను ఇప్పటిదాకా వాయిదా వేస్తూ ఇప్పుడు దానిని పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. హీరో సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉండగా ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులు ముందుకు వచ్చి అందరిలో ఎంతో ఆసక్తిని కలిగించింది.

తొలిసారిగా పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దానికి తోడు లుక్ కూడా ఎంతో బాగా ఉండటంతో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలయ్యి చకచకా పూర్తవుతుంది. కానీ ఈ చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేస్తున్నారు అన్న క్లారిటీ మాత్రం ఇప్పటిదాకా చిత్ర బృందం ఇవ్వలేదని చెప్పాలి.

వాస్తవానికి ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు కానీ అప్పటికి ఈ సినిమా పూర్తి అవుతుందో లేదో అన్న అనుమానాలను కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. పవన్ కళ్యాణ్ కొన్ని పోరాట సన్నివేశాలలో ఇప్పుడు పాల్గొంటూ ఉండగా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టాలని చిత్ర బృందం భావిస్తుంది. మరి ఈ సినిమా యొక్క విడుదల తేదీని ఎప్పుడు నిర్ణయిస్తారో చూడాలి. ఈ సినిమా లో బాలీవుడ్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్ర లో నటిస్తుందని చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: