టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 17వ తేదీన రిలీజైన ఈ ఫిల్మ్ దేశ వ్యాప్తంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ను ఈ చిత్రం మలుపు తిప్పింది. బన్నీని సరికొత్త అవతారంలో చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. 2021లో సాలిడ్ హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది పుష్ప. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఇండియా వైడ్ నంబర్ వన్ పొజిషన్ లో కూర్చున్నాడు పుష్పరాజ్. ఏడు భాషల్లో ఈ ఫిల్మ్ రూపొందింది.కర్ణాటక, తమిళనాడులో కూడా బాగానే వసూళ్లు రాబట్టింది పుష్ప. బాలీవుడ్ లో పెద్దగా హైప్ క్రియేట్ చేయకుండానే డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కి సీక్వెల్ కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా పుష్ప 1 పై ఇప్పుడు ఓ అదిరిపోయే న్యూస్ బయటకి వచ్చింది. పుష్ప ది రైజ్ ని ఇప్పుడు రష్యా దేశంలో రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. రష్యన్ భాషలో ఈ సినిమాని డబ్బింగ్ చేసి మరీ అక్కడ రీ రిలీజ్ చేస్తున్నారు.


మరి ఈ కొత్త రిలీజ్ కి సంబంధించి డేట్ రాలేదు. పుష్ప మేనియా అక్కడ, ఇక్కడ అని లేకుండా అన్ని చోట్ల వుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ రోల్ పోషించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందింది. పుష్పరాజ్ గా కనిపించిన బన్నీ సరసన..రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించారు.హీరోయిన్ సమంత.ఓ స్పెషల్ సాంగ్ లో నటించారు.ఇప్పటికీ ఈ సాంగ్ యూ ట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది.ఐటెమ్ సాంగ్ కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. బన్నీ - సుకుమార్.. హ్యాట్రిక్ మూవీపై ఫస్ట్ నుంచి పెంచుకున్న అంచనాలకు తగ్గట్టు.. రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో దుమ్మురేపింది పుష్ప ది రైజ్. 2021లో సాలిడ్ హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది పుష్ప. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, సునీల్ లు విలన్ పాత్రలు పోషించారు. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా పుష్ప మూవీని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: