టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ నటులు అంటే వెంటనే గుర్తుకు వచ్చే హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ హీరోలు ఇప్పటికీ కుర్ర హీరోలులా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.
ఒకప్పటి హీరోయిన్లతోనే కాదు ఇప్పటి కుర్ర హీరోయిన్లతో కూడా రొమాన్స్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈ నలుగురు హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ కొంతవరకు అడుగులు వేశారు. ఇక నాగార్జున మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో కనిపించట్లేదు. అటు వెంకటేష్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో వెళ్లట్లేదు. అయినా కూడా ఈ నలుగురు హీరోలకు మాత్రం ఇప్పటికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తో పాటు వరుస అవకాశాలు అందుతున్నాయి.
నిజానికి కుర్ర హీరోలతో పోటీ పడుతున్న ఈ నలుగురు హీరోలు మాత్రం.. ఎందులో కూడా మేము తక్కువ కాదు అన్నట్లుగా నిరూపిస్తున్నారు. పైగా ఇప్పుడు తమ ఖాతాలో రెండు కంటే ఎక్కువ సినిమాలకు సైన్ చేసి పెట్టుకొని బాగా బిజీగా మారారు. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగానే అందుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ నలుగురు హీరోలు ఈ మధ్య నటించిన వరుస 4 సినిమాలలో బాగానే కలెక్షన్స్ సొంతం చేసుకున్నారు. ఇంతకు ఆ కలెక్షన్స్ ఎన్నో తెలుసుకుందాం.బాలకృష్ణ: నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో రూ. 9 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు ఒక కోటి మాత్రమే సొంతం చేసుకున్నాడు. రూలర్ కు రెండు కోట్లు, అఖండకు రూ.14 కోట్లతో సెన్సేషనల్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు.నాగార్జున: టాలీవుడ్ కింగ్ నాగార్జున మన్మధుడు సినిమాతో నాలుగు కోట్లు మాత్రమే సొంతం చేసుకున్నాడు. వైల్డ్ డాగ్ తో రూ. 1.8 కోట్లు సొంతం చేసుకున్నాడు. ఇక తన కొడుకుతో కలిసిన నటించిన బంగార్రాజు సినిమాలో రూ. 8 కోట్లను అందుకున్నాడు. ఇటీవల విడుదలైన ద ఘోస్ట్ సినిమాలో రూ. 3.5 కోట్లు సొంతం చేసుకున్నాడు.వెంకటేష్:
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ గురు సినిమాతో రూ. 2.3 కోట్లు సొంతం చేసుకున్నాడు. ఎఫ్2 సినిమాతో రూ. 6.6 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. వెంకీ మామ సినిమాతో ఏడు కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఎఫ్ త్రీ సినిమాతో రూ. 12 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.చిరంజీవి: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో రూ. 38 కోట్లు వసూలు చేసుకున్నాడు. ఇక సైరా సినిమాతో రూ. 54 కోట్లను, ఆచార్య సినిమాతో రూ. 36 కోట్ల కలెక్షన్ అందుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాకు ఇప్పటివరకు రూ.12 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. అలా ఈ నలుగురు హీరోలు సినిమా అంత సక్సెస్ కాలేకున్న కూడా కొంతవరకు బాగానే కలెక్షన్స్సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: