తమిళ్ క్రేజీ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యంగ్ హీరో నటించిన లు తెలుగులోనూ డబ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు శివ కార్తికేయన్ తెలుగులో చేస్తున్న విషయం తెలిసిందే.. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కంప్లీట్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతోన్న ‘ప్రిన్స్’ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ చిత్రంలో ”బింబిలిక్కి పిలాపి” , జెస్సికా పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. తాజాగా ఈ చిత్రం నుండి ‘హూ యామ్ ఐ’ పాటని విడుదల చేశారు చిత్రయూనిట్. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిల్ డ్యాన్స్ నెంబర్ గా ఈ పాటని కంపోజ్ చేశారు. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. డింకర్ కల్వల ఎనర్జిటిక్ గా పాడగా, రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఇన్స్టంట్ హిట్ గా అలరించిన ఈ పాట ప్రిన్స్ ఆల్బమ్ లో మరో చార్ట్ బస్టర్ గా నిలిచింది.సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర స్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస టోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: