సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అన్నది మాత్రం వాస్తవం . సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా బ్రతకాలని వెండితెరపై తమ బొమ్మను ఓ రేంజ్ లో పాపులర్ చేసుకోవాలని ఎంతో మంది హీరోలు హీరోయిన్లు ఇంట్లో ఇష్టం లేకపోయినా సరే ఒప్పించి బలవంతంగా కొందరు..
పారిపోయి కొందరు ..సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు . వీళ్ళల్లో కొందరు హీరో హీరోయిన్లుగా నటించి సెటిల్ అయితే.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీలోని మాయకు తట్టుకోలేక వెనుకబడిపోయారు.

ఫైనాన్షియల్ కష్టాలతో ఆత్మహత్య చేసుకున్నారు .వాళ్ళల్లో మనం మరీ ముఖ్యంగా ముందు వరుసలో ఉన్నారు ఉదయ్ కిరణ్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాల అవసరం లేదు . తేజ డైరెక్షన్లో వచ్చిన చిత్రం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. యువతను ఓ ఊపు ఊపేసిన సినిమా ఇదే . ఇక ఆ తర్వాత వచ్చిన నువ్వు-నేను , మనసంతా నువ్వే సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్.
నువ్వు నేను , మనసంతా నువ్వే, కలుసుకోవాలని మూడు సినిమాలను వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సినీ ఇండస్ట్రీలో యంగ్ లవర్ బాయ్ గా ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వాటి కారణంగా సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అతని తొక్కేయాలని చూడడంతో ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలోనే ఆయనతో సినిమాను తెరకెక్కించడానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ చూపించలేదు.

ఇక ఫైనాన్షియల్ గా కష్టాలు రావడంతో ఆఖరికి తన బెస్ట్ ఫ్రెండ్ తనకు ఎంతో ఆప్తుడైన స్టార్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి " ఒక కథ ఉంది.. డైరెక్టర్ కూడా సిద్ధమే.. మీరు ప్రొడ్యూస్ చేస్తారా.. ప్లీజ్" అని అడిగినా కానీ అతడు కనికరించలేదట. టేబుల్ వద్ద ఉన్న చిల్లరను ఉదయ్ కిరణ్ ముఖాన కొట్టి ఫేస్ వాల్యూ ఇంతే అంటూ అతన్ని దారుణంగా అవమానించాడట. ఈ విషయం ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత బయటపడింది . కేవలం ఈ ప్రొడ్యూసర్ ఏ కాదు ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు అతని ఫ్రెండ్స్ కూడా అతని దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడలేదట . ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్దాయన ఉదయ్ కిరణ్ ని దూరం పెట్టడమే కారణంఅంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా సరే సినీ ఇండస్ట్రీ మంచి హీరోని కోల్పోయింది అన్న మాట మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: