సమంత ప్రస్తుతం తన సినిమా పనులతోనే బిజీగా ఉంటోంది. మధ్యలో కొన్ని రోజులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది. తన మీద ఎన్ని రూమర్లు వచ్చినా సైలెంట్‌గానే ఉంటూ వచ్చింది.


విడాకుల అనంతరం తన మీద వచ్చిన పిచ్చి పిచ్చి కథనాలు, రూమర్ల మీద మండిపడింది. కోర్టు మెట్లు కూడా ఎక్కి పోరాడింది. తన మీద తప్పుడు కథనాలు రాసిన వారిపై చర్యలు తీసుకుందట.


సమంత వ్యవహారం విడాకుల తరువాత మరింతగా మారింది. సమంత చైతన్య విడిపోయిన తరువాత వచ్చిన కథనాలు, సమంత స్నేహితుల మీద జరిగిన నెగెటివ్ ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. సమంత పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ వల్లే ఈ విడాకులు జరిగాయనే రూమర్లు ఎక్కువగా వచ్చాయి. కానీ తాను సమంతను అక్కా అని పిలుస్తానంటూ ప్రీతమ్ క్లారిటీ ఇచ్చాడట..


ఇక సమంత తన చుట్టూ ఉన్న స్నేహితుల వల్లే ప్రభావం అయిందని, అందుకు కారణం ఆమె స్టైలిష్ట్ ప్రీతమ్, మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్, చిన్మయి, దర్శకురాలు నందినీ రెడ్డి, డాక్టర్ మంజుల అంటూ ఇలా నానా రకాల పేర్లు వార్తల్లో వైరల్ అయ్యాయి. అయితే సమంత మీద జరిగిన ట్రోలింగ్‌ను సాధన, ప్రీతమ్, చిన్మయి ఇలా అందరూ తిప్పి కొట్టేశారట.


సమంత తన స్నేహితులతోనే ఎక్కువగా గడిపింది. విడాకుల తరువాత శిల్పారెడ్డితో కలిసి సమంత ఛార్ ధామ్ యాత్రకు వెళ్లింది. ఆ తరువాత దుబాయ్ ట్రిప్‌కు వెళ్లింది. అలా ట్రిప్పులు మీద ట్రిప్పులు వేసింది. సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి షూటింగ్‌లలో చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ కూడా తెలిసిందే. శాకుంతలం, యశోద సెట్స్‌లో సాధన, ప్రీతమ్, సమంత కలిసి తెగ అల్లరి చేస్తుండేవారు.


తాజాగా సమంత ఫ్రెండ్ సాధన సింగ్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సమంత పాత ఫోటోలను సాధన షేర్ చేసింది. సమంత బోల్డ్ ఫోటోలను ఇలా సాధన షేర్ చేయడంతో కొంత మంది నెటిజన్లు కాస్త పెదవి విరిచినట్టు కనిపిస్తోంది. దీనిపై సాధనను ప్రశ్నించారు. కానీ సాధన మాత్రం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిందట..


ఇవి పాత ఫోటోలు కదా? ఇప్పుడు ఇవి ఎందుకు షేర్ చేశారు? అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో సాధన సింగ్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. నిన్ను పర్మిషన్ అడిగి పోస్ట్ చేయాలా? నువ్ టైప్ చేసే ముందు కాస్త ఆలోచించుకో అంటూ చురకలు అంటించిందట.. దీంతో సాధన రిప్లై చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: