
-
abhishek
-
Allu Aravind
-
anupama parameswaran
-
Bunny Vas
-
Chiranjeevi
-
Chitram
-
Christmas
-
Cinema
-
December
-
dil raju
-
local language
-
mahesh babu
-
Makar Sakranti
-
Mammootty
-
Music
-
Nijam
-
pujita ponnada
-
rashmika mandanna
-
Ravi
-
ravi teja
-
Reddy
-
Romantic
-
Sakshi
-
sampath
-
Sangeetha
-
sharath
-
Sharrath Marar
-
sudheer varma
-
sushanth
-
Tamil
-
thaman s
-
vakkantham vamsi
-
vamsi paidipally
రావణాసురుడి రాక ఫిక్స్
ఎక్కడా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్‌టైన్ చేస్తున్న రవితేజ.. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో 'రావణాసుర'గా రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రవితేజ లాయర్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్. సుశాంత్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇది వచ్చిన వారం తర్వాత చిరంజీవి 'భోళాశంకర్', ఆ నెలాఖరుకి మహేష్ బాబు సినిమాలు విడుదల కానున్నాయి తప్ప ఇప్పటికైతే ఈ మూవీకి పోటీ లేదుకార్తికేయ 2'తో సెన్సేషనల్ హిట్ కొట్టిన నిఖిల్ నుంచి నెక్స్ట్ వస్తున్న సినిమా.. '18 పేజెస్'. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇదే రోజున రవితేజ 'ధమాకా' వస్తోంది. పైగా క్రిస్మస్ సీజన్ కనుక మరిన్ని సినిమాలు రేస్‌కి రెడీ అవ్వొచ్చు. అంటే నిఖిల్‌కి బాక్సాఫీస్ దగ్గర కాస్త గట్టి పోటీనే ఎదురయ్యే చాన్స్ ఉంది.
'ఏజెంట్' రాక ఎప్పుడంటే..
ఇంతవరకు లవర్ బోయ్‌గా ఆకట్టుకున్న అఖిల్.. 'ఏజెంట్' మూవీలో గూఢచారిగా యాక్షన్ ప్యాక్డ్ రోల్ చేస్తున్నాడు. వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సాక్షి వైద్య హీరోయిన్. మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల సందేహాలు తలెత్తాయి. అవన్నీ నిజం కాదని తేల్చేస్తూసంక్రాంతికి సినిమాని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీమ్. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అయితే టాప్ స్టార్స్ అందరూ వస్తున్న సంక్రాంతికి ముహూర్తం పెట్టారంటే 'ఏజెంట్' రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యాడన్నమాటే!
వారసుడి వార్
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారసుడు' చిత్రం రూపొందుతోంది. పీవీపీ సంస్థతో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ బైలింగ్వల్ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. షూటింగ్ పూర్తి కావచ్చింది. వచ్చే నెల నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సుత్తి పట్టుకుని శత్రువుల్ని చీల్చి చెండాడుతున్నాడు విజయ్. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతి బరిలో దిగడానికి ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాలు సిద్ధమయ్యాయి. మరి మన లోకల్ స్టార్స్‌తోఈ నాన్ లోకల్ స్టార్ ఎలా పోటీపడతాడో, ఎంతవరకు గెలుస్తాడో చూడాలి.