యంగ్ బ్యూటీ యాంకర్ విష్ణుప్రియ ఫస్ట్ నైట్ ని ఉద్దేశిస్తూ హాట్ కామెంట్స్ చేసింది.

క్యాష్ షోలో పరోక్షంగా ఆమె విసిరిన పంచ్లు ఆడియన్స్  నీ షాక్ ఇస్తున్నాయి. దర్శకుడు శ్రీధర్ సీపన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ వాంటెడ్ పండుగాడ్ ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ షోకి వచ్చిన విష్ణుప్రియ చిలిపి కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా,  బాగా వైరల్ అవుతుంది.

 
వాంటెడ్ పండుగాడు మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది. సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు ఈ చిత్ర సమర్పకులుగా ఉన్నారు. దీంతో ఆయన వాంటెడ్ పండుగాడ్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈటీవీ పాప్యులర్ షోస్ లో ఒకటిగా ఉన్న క్యాష్ కి కూడా రాఘవేంద్రరావు, అనసూయ, విష్ణుప్రియ, యశ్వంత్ మాస్టర్, నిత్యా శెట్టి రావడం జరిగింది.ఈ ఎపిసోడ్ లో యాంకర్ సుమ రాఘవేంద్రరావు గారి పళ్ళు, పూలు కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. విష్ణుప్రియకు యాంకర్ సుమ రెండు ఆపిల్స్ ఇచ్చారు అంటా మరీ. ఆ పళ్ళను ఉద్దేశిస్తూ… శ్రావణ మాసంలో నాకు రెండు పళ్ళు ఇచ్చారు, నాకు పెళ్ళై పళ్లతో హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నా.. అన్నారు.


ఆ కామెంట్ కి షోలో ఉన్నవారంతా  బాగా గట్టిగా నవ్వేశారు. ఇక విష్ణుప్రియ చేసిన ఆ కామెంట్ తన ఫస్ట్ నైట్ గురించే అంటున్నారు ప్రేక్షకులు. అనంతరం సుమ మరలా రెండు ఆపిల్స్, ఓ జామకాయ ఇచ్చి… అవి నువ్వు, నీ భర్త, మీకు పుట్టిన బిడ్డ… అన్నారు. ఆ మాటలకు తెగ సంతోషపడిన విష్ణుప్రియ… థాంక్యు నాకు డబ్బులు కూడా అవసరం లేదన్నారు. అనంతరం రాఘవేంద్రరావు తనకిచ్చిన పుష్ప గుచ్చం విష్ణుప్రియకు విసిరాడు. అది పట్టుకున్న ఆమె 'హే నాకు పెళ్ళైపోయినట్లే అంది. మరో గుచ్చం విసరగా.. అంటే రెండో పెళ్లి కూడా అయినట్లే అని అరిచింది. దాంతో షోలో ఉన్నవారంతా అవాక్కయ్యారు.

 
దీనికి సంబంధించిన క్యాష్ ప్రోగ్రామ్ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఇక విష్ణుప్రియ కెరీర్ పరిశీలిస్తే ఆమె గతంలో చెక్ మేట్ టైటిల్ తో ఓ మూవీ చేశారు. అది నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. యూట్యూబర్ గా అనేక షార్ట్ ఫిలిమ్స్ చేసిన విష్ణు ప్రియా, 'పోవే పోరా' షోతో యాంకర్ గా మారారు. తరచుగా ఇంస్టాగ్రామ్ లో  బాగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ కాకరేపుతూ ఉంటారు. వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఓ కీలక రోల్ దక్కించుకున్నారు అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: