అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సంచలన విజయం అందుకోవడంతో పుష్ప రెండవ భాగం సినిమా కూడా అంతటి స్థాయిలో ఉండాలని దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం ఎక్కువ సమయం ప్రీ ప్రొడక్షన్ పనులను చేశారు. ముందుగా అనుకున్న కథను పూర్తిగా మార్చి వేసి పెరిగిన అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా యొక్క కథను మలిచాడు దర్శకుడు సుకుమార్. ఇటు అల్లు అర్జున్ కూడా ఆ సినిమాకు తగ్గ మేనరిజమును బాడీ లాంగ్వేజను మార్చుకునే పనిలో పడ్డాడు.

 నవంబర్ నుంచి ఈ సినిమా మొదలు కాబోతుంది అని చాలా రోజుల నుంచి చెబుతున్నారు దీనిపట్ల చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇప్పటిదాకా ఇవ్వలేదని చెప్పాలి. ఉత్తరాదిన ప్రేక్షకులను ఎంతగానో ఆదరించినా ఈ పుష్పా సినిమా ఏ స్థాయిలో వారిని మళ్లీ అలరిస్తుందో చూడాలి. ఆ విధంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల విషయంలోనే కాదు సినిమాలు తెరకెక్కించే విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు అని అల్లు అర్జున్ దర్శక నిర్మాతలకు సూచించాడట ఖర్చుకు ఏ మాత్రం వెనకడకుండా ఈ సినిమా చేయాలని వారు చెబుతున్నారట. 

పుష్ప సినిమాతో నార్త్ లో భారీ స్థాయిలో అల్లు అర్జున్ కు ఇమేజ్ పెరిగిన నేపథ్యంలో ఆయనపై పెట్టే ప్రతి పైసా కూడా మంచి వసూలను తిరిగి రాబడుతుంది అని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పుష్ప రెండవ భాగం సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి ఇక ఈ సినిమా హైలైట్ చేసేందుకు గాను దర్శక నిర్మాతలు కొన్ని ప్రత్యేక ఆకర్షణలు ఈ సినిమా కోసం తీసుకురాబోతున్నారు. పుష్ప మొదటి భాగం లో లేని చాలా టెస్ట్లు ఈ సినిమాలో ఉండబోతున్నాయట కొత్త నటీనటులను కూడా తీసుకురాబోతున్నారట. మరి ఇంతటి స్థాయిలో అంచనాలను కలిగిన ఈ సినిమా ఏ విధంగా రూపొంది ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: