వారసులు ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అవ్వడం అంటే నిప్పుల గుండం మీద నడిచినట్టే..ఎదో అదృష్టం బాగుండి రెండు మూడు సక్సెస్ లు వచ్చిన ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ తగిలితే బ్యాక్ గ్రౌండ్ లేని హీరో అడ్రస్ గల్లంతు అవుతుందటా...అలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి వరుస డిజాస్టర్స్ తగులుతున్నాయి కూడా చెక్కు చెదరని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఏకైక హీరో కూడా విజయ్ దేవరకొండ.

అర్జున్ రెడ్డి సినిమాతో ఇతగాడు యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు..ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఇతను అంటే పది చచ్చిపోతారు..అలాంటి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడటా ఈయన..విజయ్ దేవరకొండ కి కేవలం టాలీవుడ్ లోనే కాదు..పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది..ఆ క్రేజ్ ని చూసే ఆయన కొడితే ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని కొట్టాలి అనే కసితో లైగర్ సినిమా ను చేసాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు నెలలో విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం తో 200 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరబోతున్నాను అంటూ విడుదలకు ముందు గర్వంగా చెప్పుకున్న విజయ్ దేవరకొండ , చివరికి 60 కోట్ల రూపాయిల నష్టాన్ని బయ్యర్లకు ఇచ్చాడు..ఈ సినిమా కోసం విజయ్ తన కెరీర్ లో ఎంతో కీలకమైన మూడు సంవత్సరాల డేట్స్ ఇచ్చాడు..పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కి ఫైనాన్సియల్ ఇబ్బందులు ఏర్పడితే తనకి ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేసి సినిమా విడుదలైన తర్వాత ఇవ్వండి అంటూ తీసుకున్న అడ్వాన్స్ ని కూడా పెద్ద మనసుతో తిరిగి ఇచ్చాడటా...సినిమా విడుదలైంది..అట్టర్ ఫ్లాప్ అయ్యింది..అయితే 40 కోట్ల రూపాయలతో సినిమాని చుట్టేసి 150 కోట్ల రూపాయలకు అమ్ముకొని పూరి జగన్నాథ్ మరియు ఛార్మీలు మంచిగానే డబ్బులు పోగేసుకున్నారు కానీ విజయ దేవరకొండ ని మరియు ఈ సినిమాని కొన్న బయ్యర్స్ ని గాలికి వదిలేసారటా.

 

ఇటీవలే హైదరాబాద్ కి వచ్చి తనకి రావాల్సిన పారితోషికం 20 కోట్ల రూపాయిల కోసం పూరి జగన్నాథ్ కి కాల్ చేస్తే ఆయన విజయ్ దేవరకొండ కాల్ ని కూడా లిఫ్ట్ చెయ్యడం లేదట..నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం..సమయం , కష్టం అన్ని వృధా అయిపోవడం తో విజయ్ దేవరకొండ చాలా డిప్రెషన్ లో ఉన్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: