
ఇదంతా ఇలా ఉండగా పూరి జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. దర్శకుడు తో పాటు ఛార్మి కూడా అక్కడే ఉన్నది. నిన్నటి రోజున వీరిద్దరూ కలిసి బాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ T-సిరీస్ ఆఫీస్ వద్ద కనిపించారు. అందుకు సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ గా మారుతోంది. అయితే పూరి మరియు ఛార్మి కలసి ఈ ఆఫీసులో కనిపించారు. దీంతో తన తదుపరి ప్రాజెక్టు కోసమే అక్కడ కనిపించారంటు ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
పూరి జగన్నాథ్ బాలీవుడ్ హీరో తో నెక్స్ట్ మూవీ చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక అదే పని మీద భూషణ్ కుమార్ ను మీట్ అయ్యారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పూరి జగన్నాథ్ చేతులు ఒక ల్యాప్ ట్యాప్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వాస్తవానికి లైగర్ సినిమా విడుదల కంటే ముందు జనగణమన అనే ప్రాజెక్టుని సెట్స్ మీదకి తీసుకువచ్చారు అయితే ఈ చిత్రం కాస్త షూటింగ్ జరిగి మధ్యలో ఆగిపోవడం జరిగింది. మరి పూరి ఛార్మి కనిపించిన విషయంపై స్పందిస్తారేమో చూడాలి.