మాస్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మీడియా ప్రత్యేక లేఖను రిలీజ్‌ చేశారు. తాను ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి టికెట్‌ కొన్ని ప్రేక్షకులను తప్ప తానెవరిని మోసం చేయలేదని పూరి జగన్నాథ్‌ లేఖలో తెలిపారు.మళ్లీ ఇంకో సినిమా తీస్తా.. వాళ్లు ఎంటర్‌టైన్‌ చేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చచ్చిన తర్వాత ఒక్క రూపాయి తీసుకెళ్లిన వాడు ఒక్కడు లేడని.. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఒక అనుభవంగా మాత్రమే చూడాలి తప్ప.. ఫెయిల్యూర్.. సక్సెస్‌లా చూడకూడని.. జీవితంలో ఏది శాశ్వతం కాదంటూ లేఖ విడుదల చేశారు.

పూరి లేఖ పూర్తి సారాంశం ఇదే..

'సెక్సెస్‌, ఫెయిల్యూర్‌ ఈ రెండూ వ్యతిరేకం అనుకుంటాం, కాదు. ఈ రెండూ ఫ్లోలో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక తర్వాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు .. జీవితంలోలో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక అనుభవంగాచూడాలి తప్ప, ఫెయిల్యూర్‌, సెక్సెస్‌లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, ఒడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, ఊరు వెలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్‌లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్‌ని సినిమాలా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు.మైండ్‌కి తీసుకుంటే మెంటల్ వస్తది. సక్సెస్‌ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడుజ్ఞానం వస్తది.' అని పూరి లేఖలో తెలిపారు.

కావున ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ పెరుగుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్‌గా చూడొద్దు. చెడు జరిగితే మన చుట్టూ ఉన్న చెడ్డవాళ్లు మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. లైఫ్‌లో రిస్క్‌ చెయ్యకపోతే అది లైఫే కాదు.ఏ రిస్క్‌ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్. లైఫ్‌లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ క్లాప్స్ కొడతారు, అక్షింతలు వేస్తారు. సో ఇవన్నీ మీ లైఫ్‌లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: