టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వెరైటీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు అడివి శేష్.  ఆయన నటించిన మేజర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని సూపర్ హిట్ గా నిలిచింది. ఆయన కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న సినిమాగా ఇది నిలిచిపోయింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఆయన నటిస్తున్న తదుపరి సినిమా పైనే ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన నాని నిర్మాణంలో రూపొందిన హిట్ 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

సినిమా యొక్క మొదటి భాగం సంచలన విజయాన్ని అందుకోవడంతో రెండవ భాగంలో ఈ హీరోని ఎంచుకోవడం జరిగింది. మొత్తానికి నాని నిర్మాణంలో శైలేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న రెండవ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయని చెప్పాలి. ఈ సినిమా తప్పకుండా మంచి ఫలితాలను రాబట్టుకుంటుంది అని మీడియా వర్గాలు చెబుతున్నాయి. చిత్ర బృందం కూడా సినిమా అవుట్ పుట్ పట్ల సంతోషంగా ఉండడంతో ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

తొందరలోనే ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్లను వదులుతూ ఉండడం విశేషం. ఇప్పటిదాకా చేసిన సినిమాలతో మంచి బిజినెస్ అందుకున్న ఈ హీరో ఈ చిత్రం ద్వారా తన మార్కెట్ ను పెంచుకోవడం ఖాయం అని తెలుస్తుంది యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన అడవి శేసి ఈ చిత్రం ద్వారా సంచలన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు తన ఇమేజ్ను క్రేజీను పెంచుకోవడంతో పాటు బిజినెస్ కూడా రెట్టింపు చేసుకోబోతున్నాడట మరి అడివి శేష్ ఏ స్థాయిలో ఈ సినిమా ద్వారా విజయాన్ని అందుకుంతాడో చూడాలి క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: