తెలుగు సినిమా పరిశ్రమలో అందాల ముద్దుగుమ్మగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అను ఇమ్యన్యుయెల్. తన తొలి సినిమా దగ్గరనుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను తన నటనతో మాత్రమే కాదు అందచందాలతో కూడా అలరిస్తూ వారి ఆధారాభిమానాలను పొందుతుంది. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా మజ్ను ఎంతటి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె కనిపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. అయితే అలాంటి విజయాన్ని ఆమె మళ్లీ అందుకోలేక పోయిందని చెప్పాలి.

ఎన్నో ఆశలు పెట్టుకొని ఆమె చేసిన రెండు పెద్ద హీరోల సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్లాప్ అవడం ఈమె కెరియర్ను మరింత కిందకు దించింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అల్లు అర్జున్తో కలిసి నా పేరు సూర్య అనే చిత్రం కూడా చేసింది ఈ రెండు చిత్రాలలో ఆమెకు అవకాశాలు రావడం నిజంగా పెద్ద విశేషం అనే చెప్పాలి. ఒక కొత్త హీరోయిన్ కు ఎక్కువగా అనుభవం లేని హీరోయిన్ కు ఇలాంటి అవకాశాలు రావడం నిజంగా మంచి విషయం ఈ నేపథ్యంలో ఆ చిత్రాలు ఆడకపోవడం ఈమె కెరియర్ పై ఎంతో ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి.

ఆ తర్వాత పలు సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అల్లు శిరీష్ తో కలిసి ఊర్వసివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 4వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమాలో రొమాన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ సినిమా మంచి విజయం అందుకుంటే తప్ప ఈమెకు మంచి సినిమా అవకాశాలు వస్తాయని చెప్పాలి మరి భవిష్యత్తులో ఆమె పెద్ద హీరోల సినిమాల అవకాశాలు మళ్ళీ అందుకోవాలి అంటే ఈ చిత్రం ద్వారా విజయాన్ని అందుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: