టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలకు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక  సీనియర్ స్టార్ హీరోల సినిమాల శాటిలైట్ హక్కులకు కూడా భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది.ఇకపోతే హీరోల సినిమాలలో చాలా సినిమాలు రేటింగ్స్ విషయంలో తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తుండటం గమనార్హం.ఇక  ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోల సినిమాల రేటింగ్స్ ను పరిశీలిస్తే నాగ్ పై చేయి సాధించగా ఇతర హీరోలు తర్వాత స్థానాల్లో ఉన్నారు.అయితే స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా

 తెరకెక్కిన బంగార్రాజు సినిమా బుల్లితెరపై తొలిసారి ప్రసారమైన సమయంలో ఏకంగా 14 రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఇక  బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బుల్లితెరపై ప్రసారమైన సమయంలో 13.31 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.ఇదిలావుంటే  మరో స్టార్ హీరో వెంకటేష్ నటించిన ఎఫ్3 బుల్లితెరపై ప్రసారమైన సమయంలో కేవలం 8.26 రేటింగ్ ను సొంతం చేసుకుంది. అయితే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బుల్లితెరపై కేవలం 6.30 రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఇకపోతే సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో

 రేటింగ్ ను సొంతం చేసుకోకపోవడంతో అభిమానులు ఫీలవుతున్నారు.అయితే  స్టార్ హీరోల సినిమాల ఫలితాలు ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి. ఇక ఈ సినిమాలలో ఆచార్య మినహా మిగతా సినిమాలన్నీ వెండితెరపై సక్సెస్ సాధించడం కొసమెరుపు. అంతేకాదు స్టార్ హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అయితే  ఈ హీరోల తర్వాత ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇక ఈ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.ఆయితే  స్టార్ హీరోల తర్వాత ప్రాజెక్ట్ లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: